English   

ఇంట్రెస్టింగ్ గా వీరభోగ వసంతరాయుల ట్రైలర్ 

Veera-Bhoga-Vasantha-Rayalu
2018-10-16 12:07:31

కల్ట్ రైజింగ్ అంటూ ముందు నుంచీ ఆకట్టుకుంటోన్న మూవీ టీమ్ ‘వీరభోగ వసంతరాయలు’. మొదట్నుంచీ వైవిధ్యమైన సినిమాలే చేస్తూ వస్తోన్న నారా రోహిత్, శ్రీ విష్ణుతో పాటు సుధీర్ బాబు, శ్రీయ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ఇది. లేటెస్ట్ గా వీరభోగ వసంతరాయలు ట్రైలర్ విడుదల చేశారు. ఊహించినట్టుగానే ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఏదో జరుగుతోంది.. కానీ ఎవరు చేస్తున్నారో తెలియదు.. చాలా పెద్ద సంఘటనలే కనిపిస్తున్నాయి. కానీ వాటి వెనక ఎవరున్నారనేది తెలియకుండా అద్భుతంగా కట్ చేశారీ ట్రైలర్. ముఖ్యంగా ఈ సినిమాలో మెయిన్ హీరోగా నటిస్తోన్న శ్రీ విష్ణు లేకుండానే ట్రైలర్ కట్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది.

రోహిత్, శ్రీయ ఇంటెజిలెంట్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సుధీర్ బాబు ఓ ఇన్స్ పెక్టర్ గా ఉణ్నాడు. ఆశ్చర్యం ఏంటంటే.. సుధీర్ బాబు కు డబ్బింగ్ చెప్పించారు. ఇది ట్రైలర్ కే పరిమితమా లేక సినిమా అంతా డబ్బింగ్ ఉంటుందా అనేది చూడాలి. ఇక వరుసగా జరుగుతోన్న కిడ్నాప్ లు, హైజాక్ లు నగరాన్ని హై అలెర్ట్ గా మారుస్తాయి. అయితే ఇవన్నీ చేస్తున్నది ఒక్కడే అన్న విషయం పోలీస్ లకు అర్థమౌతుంది. కానీ అతనెవరో.. ఎక్కడుంటాడో మాత్రం కనుక్కోలేరు. ఆ విషయమే నిన్ను ఎలాగైనా పట్టుకుంటాను అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంటాడు రోహిత్. మొత్తంగా చాలా ఇంటెన్సివ్ గా ఉందీ ట్రైలర్. అలాగే ఇంప్రస్ చేస్తుంది కూడా. ఈ మధ్య కాలంలో వస్తోన్న వైవిధ్యమైన సినిమాల జాబితాలో థ్రిల్లర్ మోడ్ లో కనిపిస్తోంది. ఇక ఆర్ ఇంద్రసేన ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. కొత్తగా వస్తోన్న దర్శకుల్లానే ఇతనూ కొత్తగానే ఆలోచించినట్టున్నాడు. మరి ఈ నెల 26న విడుదల కాబోతోన్న వీరభోగవసంత రాయలుకు ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

More Related Stories