English   

వ‌ర్క్ షాప్ ఓపెన్ చేస్తున్న రాజ‌మౌళి.. 

Rajamouli-NTR
2018-10-16 12:22:40

రాజ‌మౌళి సినిమా అంటే ఇప్పుడు ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ సినిమాలు కూడా ఇప్పుడు ఈయ‌న ఇమేజ్ ముందు దిగ‌దుడుపే. ద‌ర్శ‌క‌ధీరుడి సినిమా అంటే ఈజీగా ఇప్పుడు 400 కోట్ల వ్యాపారం జ‌రుగుతుంది. అది ఆయ‌న‌కు ఉన్న బ్రాండ్. బాహుబ‌లి లాంటి భారీ ప్రాజెక్ట్ త‌ర్వాత ఆయ‌న రామ్ చ‌ర‌ణ్-ఎన్టీఆర్ లాంటి సూప‌ర్ స్టార్స్ తో మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన‌ప్ప‌టి నుంచీ ఏదో తెలియ‌ని ఆస‌క్తి ఇండియా అంతా ఉంది. ఈ చిత్రం ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుంద‌నే విష‌యంపై అంతటా చ‌ర్చ‌లు న‌డుస్తూనే ఉన్నాయి. చూస్తుంటే ఇప్పుడు ఈ చ‌ర్చ‌కు తెర‌ప‌డిన‌ట్లే క‌నిపిస్తుంది. ఈ సినిమా ముందు ఇదే ఏడాది సెట్స్ పైకి వ‌స్తుంద‌ని భావించినా కూడా ఇప్పుడు వ‌చ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. ముఖ్యంగా ఆయ‌న త‌న‌యుడు కార్తికేయ పెళ్లి ఉన్న కార‌ణంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి చివ‌రి వారం నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈయ‌న మ‌రో రూట్ కూడా ఫాలో అవుతున్నాడు. ఈ చిత్రం కోసం ముందు వ‌ర్క్ షాప్ ఒక‌టి సిద్ధం చేస్తున్నాడు. అక్క‌డే ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ పాల్గొంటారు. బాహుబ‌లికి కూడా ఈయ‌న ఇలాగే చేసాడు. కారెక్ట‌ర్స్ పూర్తిగా త‌మ‌లోకి ఎక్కించుకోడానికి యాక్ట‌ర్స్ కు పెట్టే స్కూల్ టైప్ ఇది. హాలీవుడ్ లో ఎక్కువ‌గా జ‌రుగుతుంటుంది. ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర రాజ‌మౌళి చేస్తున్నాడు.  తొలి షెడ్యూల్ లో ఎన్టీఆర్.. రెండో షెడ్యూల్ లో రామ్ చ‌ర‌ణ్ విడివిడిగా పాల్గొంటారు. ముందు ఎవ‌రి పోర్ష‌న్ వాళ్ల‌ను విడివిడిగా తీసిన త‌ర్వాత కాంబినేన్ సీన్స్ తీయాల‌ని చూస్తున్నాడు రాజ‌మౌళి. జ‌న‌వ‌రి నుంచి మొద‌లు పెట్టి 2020లో సినిమా విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు జ‌క్క‌న్న‌. కీర‌వాణి సంగీతం అందించ‌నున్న ఈ చిత్రాన్ని దాన‌య్య 300 కోట్ల‌తో నిర్మించనున్నాడు. 

More Related Stories