English   

అలా చెప్తే బ‌య‌ట న‌వ్వుతున్నారు ర‌కుల్..

Rakul-Preet-Singh
2018-10-16 12:46:18

ఇండ‌స్ట్రీలో ఇప్పుడు మీటూ ఉద్య‌మం రేంజ్ ఎలా ఉందో అంద‌రికీ తెలుసు. ఢిల్లీ టూ గ‌ల్లి వ‌ర‌కు అంతా అదే ధ్యాస‌లో ఉన్నారు. ఎవ‌రెవ‌రు ఎప్పుడు త‌మ‌కు కెలికారో గుర్తు చేసుకుని మ‌రి ర‌చ్చ చేస్తున్నారు ముద్దుగుమ్మ‌లు. అస‌లు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ కావాలంటే క‌చ్చితంగా లొంగిపోక త‌ప్ప‌దు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి ఇప్పుడు. ఇన్నాళ్లూ అంద‌రికీ ఈ బాధ‌లుంటాయా అనే అనుమానం ఉండేది కానీ ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది. క‌చ్చితంగా ఇండ‌స్ట్రీలో అమ్మాయిలకు ఈ బాధ‌లు త‌ప్ప‌వ‌ని అర్థ‌మైపోతుంది. కానీ ఇంత జ‌రుగుతున్నా కూడా ర‌కుల్ ఇచ్చిన స‌మాధానం మాత్రం అంద‌రికీ న‌వ్వు తెప్పిస్తుంది. త‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటి క్యాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య‌లు రాలేద‌ని చెప్పి షాక్ ఇచ్చింది ర‌కుల్. త‌న‌కు ఇండ‌స్ట్రీలో ఒక్క‌సారి కూడా ఇలాంటి ప్రాబ్ల‌మ్ రాలేద‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. బాలీవుడ్ టూ టాలీవుడ్ వ‌ర‌కు అన్ని ఇండ‌స్ట్రీలు తిరిగిన ర‌కుల్.. ఇలాంటి క‌మెంట్స్ చేయ‌డం నిజంగా ఇప్పుడు సంచ‌ల‌న‌మే. శ్రీ‌రెడ్డి గ‌తంలోనే ఈ వ్యాఖ్య‌ల‌పై చాలా సీరియ‌స్ అయింది. క‌డుపు నిండింది కాబ‌ట్టి ఏదైనా మాట్లాడ‌తావ్ నువ్వు అంటూ ర‌చ్చ చేసింది. ర‌కుల్, కాజ‌ల్ లాంటి హీరోయిన్లు త‌మ‌కు అస‌లు ఇలాంటి ఇబ్బందులే రాలేద‌ని చెబుతుండ‌టం మాత్రం విచిత్రంగానే ఉంది విన‌డానికి. అయితే అన్యాయం జ‌రిగిన వాళ్లు బ‌య‌టికి వ‌చ్చి మాట్లాడ‌టం మాత్రం సంతోషంగా ఉందని చెప్పింది ర‌కుల్ ప్రీత్ సింగ్. 

More Related Stories