English   

చిరంజీవి కాద‌న్నాడా.. అఖిల్ వైపు బోయ‌పాటి..

Boyapati-Srinu
2018-10-16 17:57:41

ఇండ‌స్ట్రీలో అగ్ర ద‌ర్శ‌కులు కూడా ఒక్కోసారి వెయిటింగ్ లిస్ట్ లో ఉంటారు. వాళ్ల‌కు టాలెంట్ లేక కాదు.. ఆ టైమ్ కు అవ‌కాశం రాక అంతే. ఇప్పుడు వినాయ‌క్ ప‌రిస్థితి ఇలాగే ఉంది. ఇక బోయ‌పాటి కూడా ఇలాగే చేస్తున్నాడు ఇప్పుడు. ఈయ‌న ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రో నెల రోజుల్లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా పూర్తైపోతుందేమో..? స‌ంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య సినిమా లైన్ లో ఉంది. ఆ త‌ర్వాత చిరంజీవి కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే రామ్ చ‌ర‌ణ్ త‌ర్వాత బాల‌య్య సినిమా చేస్తాడా లేదా అనే అనుమానాలు వ‌స్తున్నాయి. 

ఎందుకంటే ఎన్టీఆర్ బ‌యోపిక్ సంక్రాంతికి రానుంది. ఆ త‌ర్వాత మ‌రో 15 రోజుల్లో ఇంకో భాగం విడుద‌ల కానుంది. అంటే ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు బాల‌య్య అక్క‌డే బిజీ. ఆ త‌ర్వాత రెండు నెల‌ల్లో ఎల‌క్ష‌న్స్ వ‌స్తున్నాయి. ఆయ‌న త‌న ప్ర‌చారం  చేసుకోవాలి. ఇంత బిజీ షెడ్యూల్ లో బోయ‌పాటి సినిమా ఉంటుందా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారిందిప్పుడు. అందుకే ఇప్పుడు ఈయ‌న అఖిల్ కోసం క‌థ సిద్ధం చేస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు చిరంజీవి కూడా సైరా త‌ర్వాత కొర‌టాల‌తో సినిమా క‌మిట్ అయ్యాడు కాబ‌ట్టి క‌చ్చితంగా బోయ‌పాటి అడుగులు అఖిల్ వైపు ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం బోయ‌పాటికి నాగార్జున నుంచి భారీ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి చూడాలిక‌.. బోయ‌పాటి ఇమేజ్ ను అఖిల్ త‌ట్టుకుంటాడో లేదో..? 

More Related Stories