English   

లారెన్స్ తో బేరం తెగ్గొచ్చిన శ్రీ‌రెడ్డి.. 

Raghava-Lawrence
2018-10-17 09:52:16

మాట్లాడితే బాంబులే.. ఎవ‌రిపై ఎప్పుడు నోరేసుకుని ప‌డిపోతుందో తెలియ‌దు. అలా మారిపోయిందిప్పుడు శ్రీ‌రెడ్డి. ఈమెను చూస్తుంటేనే వామ్మో అంటూ పారిపోతున్నారు అంతా. పైగా అవ‌కాశాల కోసం తాను ప‌డుకున్నాన‌ని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చిన త‌ర్వాత ఇంకేం మాట్లాడతారు చెప్పండి. అయితే ఆ క్ర‌మంలోనే చాలా మంది పేర్లు బ‌య‌ట‌పెట్టింది ఈ భామ‌. అందులో లారెన్స్ కూడా ఉన్నాడు. ఆయ‌న త‌ను చేస్తున్న మంచి ప‌నుల‌తో ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటాడు. కానీ ఒక్క శ్రీరెడ్డి ఇష్యూతో మాట‌లు ప‌డాల్సి వ‌చ్చింది. అయితే ఇప్పుడు దీన్ని కూడా శ్రీరెడ్డి త‌న సొంతం కోసం వాడేసుకుంది. ఇప్పుడు లారెన్స్ తో త‌న బేరం తెగ్గొట్టేసుకుంది. త్వ‌ర‌లోనే రాఘవా లారెన్స్ చేయ‌బోయే కొత్త సినిమాలో తాను న‌టిస్తున్నట్లు చెప్పింది శ్రీరెడ్డి. అంతేకాదు.. ఈ సినిమాకు సంతకం చేసాన‌ని.. దీనికి వ‌చ్చే అడ్వాన్స్ శ్రీకాకుళం తుపాను బాధితులకు విరాళంగా ఇస్తానని మాట ఇచ్చింది శ్రీరెడ్డి. ఇక ఇదే విష‌యాన్ని ఫేస్ బుక్ లో రాస్తూ నా స్నేహితులంద‌రికీ గుడ్ న్యూస్.. లారెన్స్‌ గారిని ఆయన ఇంట్లో క‌లిసాను.. అక్క‌డే ఆడిష‌న్స్ కూడా ఇచ్చాను.. ఆయ‌న తన తర్వాతి సినిమా కోసం నన్ను తీసుకున్నారు. కచ్చితంగా మంచి పాత్ర ఇస్తానని ప్రామిస్‌ చేశారు అని పోస్ట్ చేసింది. అయితే అది ఏ సినిమా.. ఎలాంటి సినిమా.. ఎలాంటి పాత్ర అనేది మాత్రం చెప్ప‌లేదు. చూస్తుంటే త‌మిళ ఇండ‌స్ట్రీలోనే ఇప్పుడు సెటిల్ అయిపోయేలా ఉంది శ్రీరెడ్డి. ఇప్ప‌టికే తెలుగు ఇండ‌స్ట్రీని ఫుట్ బాల్ ఆడేసుకుని ఇక్క‌డ తెగ‌దెంపులు చేసుకుని చెన్నైకి చెక్కేసింది శ్రీరెడ్డి. 

More Related Stories