English   

షాకింగ్.. దీపిక ప‌దుకొనేపై యాసిడ్ దాడి.. 

Deepika-Padukone
2018-10-17 10:13:26

ప‌ద్మావ‌తి సినిమా త‌ర్వాత దీపిక ప‌దుకొనే ఎందుకు సినిమాలు చేయ‌డం లేదు..? ఆమె సినిమాలు మానేసిందా.. లేదంటే నిజంగానే క‌థ‌లు న‌చ్చ‌డం లేదా..? అదీ కాదంటే పెళ్లి త‌ర్వాత ర‌ణ్ వీర్ సినిమాలు చేయొద్ద‌ని చెప్పాడా..? గ‌త కొన్ని రోజులుగా ఆమె అభిమానుల్లో వ‌స్తున్న డౌట్స్ ఇవే. అయితే ఇప్పుడు అంద‌రి అనుమానాల‌కు తెర‌దించుతూ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది దీపిక‌. ఈమె త‌న సొంత నిర్మాణంలోనే సినిమా చేయ‌బోతుంది. అంటే ఈమె కూడా ఇప్పుడు నిర్మాత‌గా కొత్త ఇన్నింగ్స్ మొద‌లు పెట్ట‌బోతుంద‌న్న‌మాట‌. ఈ ఏడాది ఆలియా భట్ హీరోయిన్ గా రాజీ సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన‌ మేఘనా గుల్జార్ ఈ సినిమాకి దర్శకురాలిగా ఉండ‌బోతుంది. ఈమె చెప్పిన ఓ క‌థ దీపిక‌ను బాగా ఆక‌ట్టుకుంద‌ని.. ఇన్ స్పిరేష‌న్ గా ఉన్న ఈ క‌థ‌ను త‌నే నిర్మించ‌డానికి ముందుకొచ్చింద‌ని తెలుస్తుంది. ఈ సినిమాలో దీపిక పూర్తిగా డీ గ్లామ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది.

ఈ పాత్ర గురించి పూర్తిగా చెప్పాలంటే ఇందులో యాసిడ్ దాడికి బ‌లైపోయిన అమ్మాయిగా న‌టించోతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి క‌థ‌లు దీపిక లాంటి హీరోయిన్ చేస్తే క‌చ్చితంగా ప్రేక్ష‌కుల్లోకి ఇంకా బ‌లంగా వెళ్లి చైత‌న్య‌వంతంగా మార‌తారు. అందుకే క‌థ న‌చ్చి ముందుకొచ్చింది దీపిక‌. ఈ సినిమా బ‌యోపిక్ అని తెలుస్తుంది. 15 ఏళ్ళ వయసులో యాసిడ్ దాడికి గురై ఆ త‌ర్వాత చాలా ఆప‌రేష‌న్ ల‌తో అస‌లు బ‌తుకుపైనే ఆశ‌లేని స్టేజ్ నుంచి ఆ త‌ర్వాత నిల‌బ‌డి.. 2014లో యు.ఎస్.స్టేట్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు పొందిన లక్ష్మీ అగర్వాల్  జీవితం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతుంద‌ని తెలుస్తుంది. ఈ సినిమాలో కేవ‌లం అమ్మాయిల బ‌ల‌హీన‌త కాదు.. వాళ్లు ఓడిన త‌ర్వాత మ‌ళ్లీ గెలిచే విధానాన్ని ద‌ర్శ‌కురాలు మేఘనా రాసుకుంది. అది విని చ‌లించిపోయింది దీపిక‌. అందుకే త‌నే నిర్మించ‌బోతుంది. మొత్తానికి కాస్త గ్యాప్ తీసుకున్నా కూడా అద్భుత‌మైన క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తుంది దీపిక ప‌దుకొనే. 

More Related Stories