English   

ఎన్టీఆర్ చెల్లిగా స‌మంత‌.. క‌ష్ట‌మైన ఇదే నిజం.. 

Samantha
2018-10-17 10:55:59

అదేంటి.. ఎన్టీఆర్ చెల్లిగా స‌మంత న‌టించ‌డం ఏంటి..? అస‌లు చెల్లి పాత్ర‌లు చేయాల్సిన అవ‌స‌రం స‌మంత‌కు ఇప్పుడు ఏం వ‌చ్చింది..? అయినా ఎన్టీఆర్ కు ఎలా చెల్లిగా న‌టిస్తుంది అనుకుంటున్నారా..? యూ ట‌ర్న్ సినిమాతో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది స‌మంత‌. అంత‌కుముందు వ‌ర‌కు కేవ‌లం గ్లామ‌ర్ స్టార్ గానే ఉంది స‌మంత‌. ఒక్క సినిమాలో కూడా పూర్తిగా త‌న‌పైనే న‌డిచే క‌థ‌ను ఎంచుకోలేదు. అన్నీ హీరోల చాటు పాత్ర‌ల్లోనే క‌నిపించింది. అయితే తొలిసారి ధైర్యం చేసి యూ ట‌ర్న్ సినిమా చేసింది. అది క‌మ‌ర్షియ‌ల్ గా ఫ్లాప్ అయింది కానీ న‌టిగా మాత్రం స‌మంత‌కు మంచి పేరే తీసుకొచ్చింది. దాంతో ఈ చిత్రం ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పుడు విల‌న్ పాత్ర‌లో న‌టించ‌డానికి ఒప్పుకుంటుంది స‌మంత‌. అస‌లు ఈమె చేస్తోన్న ఆ పాత్ర ఏంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు ఆడియ‌న్స్. ఎందుకంటే చ‌రిత్ర‌లో నిలిచిపోయిన పాత్ర అది. అదే రామాయాణంలోని సూర్ప‌ణ‌ఖ‌. యాడ్ ఫిల్మ్ మేకర్.. మోషన్ క్యాప్చ‌ర్ స్పెష‌లిస్ట్ భార్గ‌వ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో ముందు కాజ‌ల్ హీరోయిన్ గా అనుకున్నా కూడా ఇప్పుడు స‌మంత వైపు పాత్ర మ‌ళ్లింది. ఇక ఎన్టీఆర్ చెల్లి అని ఎందుకు అంటున్నారంటే.. రావ‌ణ అంటే ముందు ఇప్పుడు గుర్తుకు వ‌చ్చేది ఎన్టీఆర్. జై ల‌వ‌కుశ‌లో ఆయ‌న చేసిన రావ‌ణ పాత్ర అలా ఉంటుంది మ‌రి. నిజంగా ఆ రావ‌ణుడి చెల్లే ఈ సూర్ప‌ణ‌ఖ‌. అందుకే రావ‌ణ చెల్లి పాత్ర కాబ‌ట్టే అలా చెప్పాల్సి వ‌చ్చింద‌న్న‌మాట‌. ఈ చిత్రంపై పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయి. 

More Related Stories