English   

తెలుగు ఇండ‌స్ట్రీలో ఒకే ఒక్క‌డు ఎన్టీఆర్.. 

NTR
2018-10-17 14:10:56

ఎన్టీఆర్ ఇప్పుడు రికార్డుల రారాజు అయిపోయాడు. ఈయ‌న సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే అమ్మో అనుకోవాల్సిందే. ఒక్క‌టి రెండు కాదు.. ఒకే సారి అర‌డ‌జ‌న్ రికార్డులు త‌న పేర రాసుకున్నాడు ఈ హీరో. ఇప్పుడు అర‌వింద స‌మేత కూడా క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తుండ‌టంతో చాలా రికార్డ్స్ ఇప్పుడు యంగ్ టైగ‌ర్ పేరు మీదకు వ‌చ్చేసాయి. ముఖ్యంగా నైజాంలో వ‌ర‌స‌గా మూడు సార్లు 15 కోట్ల షేర్ అందుకున్న హీరో ఎవ‌రూ లేరు. జ‌న‌తా గ్యారేజ్ నుంచి ఈ ర‌చ్చ మొద‌లైంది. జై ల‌వ‌కుశ కూడా 16 కోట్ల‌కు పైగా షేర్ సాధించింది. ఇక ఇప్పుడు విడుద‌లైన అర‌వింద స‌మేత కూడా ఐదు రోజుల్లోనే 15 కోట్ల షేర్ అందుకుంది. ఇప్ప‌టికీ అదే దూకుడు చూపిస్తుంది. దాంతోపాటు వ‌ర‌స‌గా నాలుగుసార్లు ఓవ‌ర్సీస్ లో 1.5 మిలియ‌న్ మార్క్ అందుకున్న హీరో సౌత్ ఇండియాలోనే ఎవ‌రూ లేరు. 

నాన్న‌కు ప్రేమ‌తో నుంచి ఈ ర‌చ్చ కొన‌సాగుతూనే ఉంది. దానికితోడు సీడెడ‌ల్ వ‌ర‌స‌గా మూడు సినిమాల‌తో 10 కోట్ల షేర్ అందుకున్న ఏకైక హీరో ఎన్టీఆర్. ఇది కూడా ఓ రికార్డే. తెలుగు ఇండ‌స్ట్రీలో వ‌ర‌స‌గా మూడు సినిమాల‌తో 75 కోట్ల షేర్ అందుకున్న హీరో కూడా ఎన్టీఆర్ ఒక్క‌డే. జ‌న‌తా గ్యారేజ్.. జై ల‌వ‌కుశ‌.. ఇప్పుడు అర‌వింద స‌మేత‌తో ఇది చేసి చూపించాడు ఎన్టీఆర్. దానికి తోడు మూడు సినిమాల‌తో 100 కోట్ల గ్రాస్ అందుకున్న హీరో కూడా ఎన్టీఆర్ మాత్ర‌మే. ఇలా ఒక్క సినిమాతో ఇన్ని రికార్డులు.. ఒక్కో సినిమాతో ఎన్నో రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఇక రాజ‌మౌళి సినిమాతో ఇంకెన్ని రికార్డులు త‌న పేర రాసుకుంటాడో..? 

More Related Stories