English   

కంగ‌న ర‌నౌత్ ఇష్యూలోకి ప్ర‌భాస్.. టెన్ష‌న్ లో ఫ్యాన్స్ 

Kangana-Ranaut
2018-10-17 14:58:29

అస‌లు ఇప్పుడు కంగ‌న ర‌నౌత్ పేరు వింటేనే హీరోలు వ‌ణికిపోతున్నారు. ఎప్పుడు ఎవ‌రి పేరు బ‌య‌ట‌పెడుతుందో తెలియ‌క టెన్ష‌న్ తో చ‌స్తున్నారు. ఏం చేయ‌క‌పోయినా కూడా ఇప్పుడు కొంద‌రు హీరోయిన్లు కావాల‌నే ఆడుకుంటున్నారు. అయితే కంగ‌న మాత్రం కావాల‌నే కొంద‌రు పేర్లు బ‌య‌ట పెట్టి బాలీవుడ్ లో భ‌యం పెంచేసింది. ఇక ఇప్పుడు ఈమె నోటి లోంచి ప్ర‌భాస్ పేరు వ‌చ్చింది. అయితే అది క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూ మాత్రం కాదు.

 ఏక్ నిరంజ‌న్ సినిమాలో ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ప్లాప్ అయింది. అయితే ఆ త‌ర్వాత తెలుగు సినిమాల‌కు పూర్తిగా దూరంగానే ఉంది కంగ‌న‌. క‌నీసం ఇటు వైపు చూడ‌లేదు ప‌ట్టించుకోలేదు కూడా. అయితే ఇప్పుడు త‌న కెరీర్ గురించి మాట్లాడుకుంటూ ఒక్క‌సారి ఏక్ నిరంజ‌న్ సినిమాను.. ప్ర‌భాస్ ను కూడా గుర్తు చేసుకుంది కంగ‌న‌. 

అయితే ప‌దేళ్లుగా త‌నతో ప్ర‌భాస్ ట‌చ్ లో లేడ‌ని.. ఏక్ నిరంజ‌న్ త‌ర్వాత అస‌లు మాట్లాడుకోవ‌డం లేద‌ని.. క‌లిసి కూడా కొన్నేళ్లైపోయింద‌ని చెప్పింది. మ‌ళ్లీ అత‌డి పేరు బాహుబ‌లి టైమ్ లోనే విన్నాన‌ని.. ఆ చిత్రం చూసాను బాగుంద‌ని.. బాగా న‌టించాడ‌ని చెప్పింది. త‌న న‌ట‌న గురించి కూడా ప్ర‌భాస్ క‌చ్చితంగా వినే ఉంటాడ‌ని చెప్పింది. అయితే ఏక్ నిరంజ‌న్ టైమ్ లో గొడవ జ‌ర‌గ‌డం వ‌ల్లే తాము ఇద్ద‌రూ మాట్లాడుకోవ‌డం మానేసామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది కంగ‌న ర‌నౌత్. అయితే అది ఏ గొడ‌వ‌నేది మాత్రం చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం ఈమె ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ బ‌యోపిక్ మ‌ణిక‌ర్ణిక‌లో న‌టిస్తుంది. 

More Related Stories