English   

హ‌లో గురు ప్రేమ‌కోస‌మే ఓవ‌ర్సీస్ వచ్చేసింది

Hello Guru Prema Kosame Overseas Premier Show Talk
2018-10-18 07:56:53

నేనుశైల‌జ త‌ర్వాత వ‌ర‌స‌గా రెండు ఫ్లాపులు ఇచ్చాడు రామ్. అనుకోకుండా వ‌చ్చిన హైప‌ర్.. హిట్ అవుతుంది అనుకున్న ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ. ఈ రెండు సినిమాల త‌ర్వాత ఇప్పుడు మ‌రోసారి హ‌లో గురు ప్రేమ‌కోస‌మే అంటూ వ‌చ్చేసాడు. ఈ చిత్రానికి ఓవ‌ర్సీస్ నుంచి వినిపిస్తున్న టాక్ చూస్తుంటే ఈ సారి రామ్ క‌ల నెర‌వేరేలా క‌నిపిస్తుంది. మ‌రోసారి రొటీన్ క‌థే అయినా కూడా మంచి కామెడీతో వ‌చ్చాడ‌ని తెలుస్తుంది. రామ్ కోరుకున్న విజ‌యాన్ని తిమ్మిని బ‌మ్మిని చేసి త్రినాథ‌రావ్ బ్యాచ్ ఇచ్చారంటున్నారు ప్రేక్ష‌కులు.

ముఖ్యంగా ఫ‌స్టాఫ్ కామెడీ సినిమాకు హైలైట్ అని.. ట్రైయాంగిల‌ర్ ల‌వ్ స్టోరీలు కొత్త కాక‌పోయినా కూడా కామెడీతో చాలా వ‌ర‌కు క‌వ‌ర్ చేసార‌ని తెలుస్తుంది. సెకండాఫ్ లో కొన్ని చోట్ల ఎమోష‌నల్ సీన్స్ కూడా బాగానే పేలాయంటున్నారు ప్రేక్ష‌కులు. ఇక దేవీ సంగీతం.. ప్ర‌స‌న్న కుమార్ డైలాగ్స్ తో సినిమా రేంజ్ మారింది. మొత్తానికి చాలా రోజుల త‌ర్వాత రామ్ మొహంలో హిట్టు క‌ళ క‌నిపించేలా ఉందిప్పుడు.

More Related Stories