English   

ఎన్టీఆర్ తో ఆట‌లేంటి వ‌ర్మ‌గారు

Director Ram Gopal Varma Hunting Sr NTR Role for Lakshmi’s NTR Movie
2018-10-18 08:41:32

కొంద‌రిని  అలా వ‌దిలేయాలి.. వాళ్ల‌ను చ‌ద‌వడానికి కానీ.. అర్థం చేసుకోడానికి కానీ ప్ర‌య‌త్నించ‌కూడ‌దు.. అలా చేస్తే మ‌న‌కు పిచ్చెక్క‌డం ఖాయం. ఆ లిస్ట్ లో అంద‌రికంటే ముందుంటాడు వ‌ర్మ‌. ఆయ‌న్ని అర్థం చేసుకోడానికి ట్రై చేస్తే అంతే సంగ‌తులు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు వ‌ర్మ‌. ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ఇది. ఎక్క‌డ మొద‌లుపెట్టి.. ఎక్క‌డ ఆపేస్తాడో ఆయ‌న‌కు కూడా క్లారిటీ ఉందో లేదో తెలియ‌దు కానీ ఇప్పుడు ఈయ‌న ఫాలో అవుతున్న ఓ రూట్ మాత్రం ఖచ్చితంగా ప్రేక్ష‌కుల‌కు ఆస‌క్తి పుట్టిస్తుంది. ఇందులో చంద్ర‌బాబు పాత్ర కోసం ఓ డూప్ ను ప‌ట్టుకున్నాడు వ‌ర్మ‌.

అచ్చంగా చంద్ర‌బాబును పోలిన వ్య‌క్తిని ల‌క్ష ఇచ్చి మ‌రీ ప‌ట్టుకున్నాడు వ‌ర్మ‌. ఇక ఇప్పుడు త‌న‌కు ఎన్టీఆర్ లాంటి వ్య‌క్తి కావాలంటున్నాడు. అలా కానీ ప‌ట్టుకుని వ‌చ్చినా.. అలాంటి వ్య‌క్తి వివ‌రం తెలిపినా కూడా వాళ్ల‌కు ఏకంగా చెప్పినోళ్ల‌కు 10 ల‌క్ష‌లు ఇస్తాన‌ని అనౌన్స్ చేసాడు వ‌ర్మ‌. మ‌నిషిని పోలిన మ‌నుషులు సినిమాలో ఉంటారు కానీ బ‌య‌ట ఉండ‌ర‌ని అంటారు కానీ చంద్ర‌బాబు డూప్ ను చూసిన త‌ర్వాత బ‌య‌ట కూడా ఉంటార‌ని అర్థ‌మైపోతుంది. అందుకే అన్న‌గారిని కూడా ప‌ట్టుకోండ‌ని చెబుతున్నాడు. అస‌లు ఎన్టీఆర్ లాంటి పెద్దాయ‌న‌తో వ‌ర్మ ఆట‌లేంటో అర్థం కావ‌డం లేదు కానీ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ జ‌రుగుతున్న తీరు మాత్రం నిజంగానే హాస్యాస్ప‌దంగా ఉంది. మ‌రి ఈ చిత్రం పూర్త‌య్యేవ‌ర‌కు వ‌ర్మ ఇంకెన్ని సంచ‌ల‌నాలు చేస్తాడో చూడాలి..!

More Related Stories