English   

హలోగురూ ప్రేమకోసమే రివ్యూ

Hello-Guru-Prema-Kosame-Review
2018-10-18 06:37:52

రామ్, అనుపమా పరమేశ్వరన్, దిల్ రాజు.. ముగ్గరూ ఓ మంచి హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నారు. వారి గత సినిమాలు బాగా నిరాశపరిచాయి. దీంతో ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడు కొందరు నవ్వారు. మరికొందరు బౌన్స్ బ్యాక్ అవుతారా అనుకున్నారు. మొత్తంగా ఫస్ట్ లుక్ నుంచి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నప్పుడు చాలామందికి ఈ సినిమాపై నమ్మకం పెరిగింది. మరి పెరిగిన ఆ నమ్మకాన్ని అంచనాలను వీళ్లు నిలబెట్టుకున్నారా..? హలో గురూప్రేమకోసమే సినిమా ఎలా ఉంది.. 

కథ: 

కాకినాడలో ఓ అప్పర్ మిడిల్ క్లాస్ కు చెందిన కుర్రాడు సంజూ(రామ్). ఇంజినీరింగ్ చదివిన సంజూ హ్యాపీగా ఫ్రెండ్స్ తో గడిపేస్తుంటాడు. ఆ టైమ్ లో పేరెంట్స్ కోరికపై హైదరబాద్ లో ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంటాడు. ఉద్యోగం కోసం వెళుతోన్న క్రమంలో అతను ట్రెయిన్ లో అనుపమ(అనుపమ పరమేశ్వరన్)ను అమ్మాయిని ఏడిపిస్తాడు. దీంతో అనుకు అతనిపై ఫస్ట్ లుక్ లోనే బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. హైదరాబాద్ వెళ్లాక సంజూ అను ఇంటి వరకూ వెళతాడు. తీరా చూస్తే సంజూ వెళ్లేది. అను వాళ్ల ఇంటికే అని తెలుస్తుంది. అను ఫాదర్ విశ్వనాథ్(ప్రకాష్ రాజ్). ఎవరికైనా మాటఇస్తే అస్సలు తప్పడు. అలాంటి విశ్వనాథ్ (ప్రకాష్ రాజ్) సంజూ తల్లి(సితార) క్లాస్ మేట్స్. మంచి ఫ్రెండ్స్. దీంతో సంజూను ఆ ఇంట్లో ఉండమని చెబుతుంది సంజూ తల్లి. అలా ఆ ఇంట్లోకి వెళ్లిన సంజూ ఆఫీస్ ఓ లో రీతూ అనే అమ్మాయిని ‘ఇష్టపడతాడు’. కానీ రీతూ తన ప్రేమను సంజూకు చెప్పే టైమ్ లో తను అనును ప్రేమిస్తున్నట్టు ‘తెలుసుకుంటాడు’. తను ఆ విషయం చెప్పాలనుకునే టైమ్ లోనే అనూకు వేరే అబ్బాయితో పెళ్లి చేయాలనుకుంటాడు విశ్వనాథ్. దీంతో సంజూ షాక్ తింటాడు. అయినా ఓ మద్యం తాగిన రాత్రి తను అనును ప్రేమిస్తున్నట్టు విశ్వనాథ్ కే చెబుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది. విశ్వనాథ్ వీరి ప్రేమకు ఒప్పుకున్నాడా..? ఒక ఒప్పందం మేరకు విశ్వనాథ్, సంజూ స్నేహితులుగా మారతారు. మరి వీరిలో స్నేహితులు గెలిచారా.. లేక ప్రేమ గెలిచిందా.. అనేది మిగతా కథ.

విశ్లేషణ:

ప్రేమకథలు ఎప్పుడైనా ఆకట్టుకుంటాయి. కాకపోతే కథనం వైవిధ్యంగా ఉండాలి. ఆ కథనంలో నవ్యత లేకపోతే ప్రేమకథలన్నీ ఒకేలా అనిపిస్తాయి. రామ్ లాంటి హీరో, అనుపమా లాంటి బ్యూటీ ఉన్నప్పుడే యాక్షన్ జోలికి వెళ్లకుండా మంచి ప్రేమకథకే ప్రిఫర్ చేసిన దర్శకుడు ఫస్ట్ స్టెప్ లోనే సక్సస్ అయ్యాడు. ఆ ప్రేమకథ గొప్పగా ఉందా లేదా అనేది పక్కన బెడితే అసలు.. ఎక్కడా బోర్ కొట్టకుండా వీరి మధ్యే కథనం నడిపించి.. సాధ్యమైనంత వరకూ ఎంగేజ్ చేయడంలో దర్శకుడు విజయం సాధించాడు. ఇంతకు ముందు సినిమా చూపిస్తమావా, నేను లోకల్ వంటి సినిమాలతో హిట్స్ కొట్టిన దర్శకుడు త్రినాథరావు నక్కిన మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఈ మూడు సినిమాల్లోనూ కామన్ గా కనిపించే విషయం ఏంటంటే.. అతని కథలోని కీ పాయింట్స్ అన్నీ హీరోయిన్ ఫాదర్ చుట్టే తిరగడం. హీరో ప్రేమ హీరోయిన్ ఫాదర్ నిర్ణయం పై ఆధారపడి ఉండటం. ఇది కాకతాళీయం అయితే ఫర్వాలేదు కానీ కంటిన్యూ ఇకపై బోర్ కొట్టడం తథ్యం. 

ఇక సినిమా పరంగా చూస్తే రామ్ ఎనర్జీని వాడుకోవాలని కాకుండా అతని కేపబిలిటీస్ పై దృష్టిపెట్టి తీసిన సినిమా. ఆ కోణంలోనూ ఉత్సాహంగా నటించాడు రామ్. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తో వచ్చే సీన్స్ అన్నీ బాగా వర్కవుట్ అయ్యాయి. ప్రకాష్ రాజ్ ఎందుకంత వాల్యూబుల్ నటుడనేది మరోసారి తెలుస్తుంది. మైన్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ను ఆయన పలికించిన విధానం ఆకట్టుకుంటుంది. తన ఇంట్లో ఉంటూ.. తన సమక్షంలోనే ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ అయిన తన కూతురును ప్రేమిస్తున్నానని చెప్పిన కుర్రాడితో ఆయన ప్రవర్తించిన విధానం మంచి కథనంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో వీరి మధ్య వచ్చే డైలాగ్స్ కూడా కన్విన్సింగ్ గా ఉంటాయి. అందుకే ఆ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ ఏదో లాగించాలి కాబట్టి అనుకున్నాడేమో దర్శకుడు.. సంజూకు ఆఫీస్ లో మరో ‘లవ్’ కథ పెట్టాడు. కానీ అదేమంత పండలేదు. అలాగే అతను తను అను ను ప్రేమిస్తున్నట్టుగా చెప్పే విషయం పెద్దగా ఆకట్టుకోదు. కానీ ప్రేమ విషయం చెప్పుకుండానే వీరి మధ్య వచ్చే సీన్స్ ఎంగేజ్ చేస్తాయి. దీంతో ప్రేమకథ బలంగా ఉండకపోయినా బోర్ కొట్టదు. కమెడియన్స్ తో కామెడీ కాకుండా కథనంలోనే ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు.

ఇందులో ప్రధాన భాగం రామ్, ప్రకాష్ రాజ్ లదే. వీరి మద్య చాలా సీన్స్ ఫన్నీగా ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ బావున్నా.. ఆ తర్వాత వచ్చిన టెర్రస్ పై మందు సీన్ ఇంట్రెస్ట్ పెంచినా.. ఆ తర్వాత కథనం సడెన్ గా డల్ అవుతుంది. దీంతో ప్రకాష్ రాజ్, రామ్ ల మధ్య సీన్స్ .. ‘లవ్ లీ’ సినిమాను గుర్తుకు తెస్తుంటాయి. కానీ చివరి 20 నిమిషాలు మళ్లీ కాస్త సీరియస్ గా స్క్రీన్ ప్లే పై దృష్టిపెట్టాడు. దీంతో క్లైమాక్స్ పెద్దగా హడవిడీ లేకుండా ఊహించినట్టుగానే అయినా కాస్త డిఫరెంట్ గా ఎండ్ చేశాడు దర్శకుడు. ఈ క్రమంలో క్లైమాక్స్ లో మళ్లీ రామ్, ప్రకాష్ రాజ్ ల మధ్య సీన్ బాగా వర్కవుట్ అయింది.

మొత్తంగా ఓ సాధారణ ప్రేమకథను కాస్త డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే క్రమంలో కొన్ని మంచి మరికొన్ని సాధారణ సీన్స్ తో నింపేసిన దర్శకుడు.. మాగ్జిమం బోర్ కొట్టకుండానే కథనం నడిపించేశాడు. దీంతో రామ్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా చాలా బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అదే ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ కూడా. ఇక పండగ కూడా ఉంది కాబట్టి.. రామ్ ఈజీగా ఈ సినిమాతో హిట్ కొట్టాడు అనిపించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

ఆర్టిస్టుల పరంగా టాప్ మార్క్స్ ప్రకాష్ రాజ్ వే. తర్వాత రామ్ మరోసారి తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో మంచి టైమింగ్ చూపించాడు. అనుపమ పాత్ర, నటన ఎప్పట్లానే బావున్నాయి. తర్వాత వచ్చీరాని ఇంగ్లీష్ తో ఇబ్బందిపెట్టే ప్రకాష్ రాజ్ భార్య పాత్రలో నటించిన ఆమని ఆకట్టుకుంది. సినిమా అంతా ప్రధానంగా ఈ పాత్రల చుట్టే తిరుగుతుంది. అంతా ప్రతిభావంతులే కాబట్టి డల్ గా ఉన్న సీన్స్ ను కూడా గట్టెక్కించారు. ఇక గెస్ట్ కు ఎక్కువ సెకండ్ హీరోయిన్ కు తక్కువ అనే పాత్రలో కనిపించిన ప్రణీత పాత్ర ముగిసిన వెంటనే తనను మర్చిపోతాం. అలాగే సితార, ప్రవీణ్, సత్య, జయప్రకాష్ పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు.. ఉన్నవీ గుర్తుపెట్టుకునేంత గొప్పగా లేవు. 

టెక్కికల్ గా : 

టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది.  కానీ ఫస్ట్ టైమ్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం నిరాశపరిచింది. ఇలాంటి ప్రేమకథలకు మ్యూజిక్ ప్లస్ కావాలి. కానీ ఈ సారి కాలేదు. పాటలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సోసో గా ఉంది. ఆర్ట్ వర్క్ బావుంది. సెట్స్ ఆకట్టుకుంటాయి. కాస్ట్యూమ్స్ చాలా బావున్నాయి. ముఖ్యంగా రామ్ కాస్ట్యూమ్స్. ప్రొడక్షన్ వాల్యూస్ దిల్ రాజు బ్యానర్ కు తగ్గట్టుగా బావున్నాయి.

ప్లస్ పాయింట్స్ : 

రామ్, ప్రకాష్ రాజ్
లవ్ స్టోరీ 
సినిమాటోగ్రఫీ
ఎంటర్టైన్మెంట్ 

మైనస్ పాయింట్ :
 
రొటీన్ లవ్ స్టోరీ
సెకండ్ హాఫ్ 
పాటలు 

ఫైనల్ గా:  రెగ్యులర్ ‘లవ్ లీ’ఎంటర్టైనర్ గురూ..

రేటింగ్:  2.5/5

More Related Stories