English   

విజయ్ దేవరకొండ తోపు అంతే.. 

Vijay-Devarakonda
2018-10-18 18:57:41

కలిసొచ్చే కాలం వస్తే హిట్టిచ్చే కథలు వస్తాయంటారు. అది టాలీవుడ్ లేటెస్ట్ సెన్షేషన్ విజయ్ దేవరకొండ విషయంలో అక్షరాలా నిజం. మనోడికి మంచి కథల రూపంలో వచ్చింది లక్కు. బేసికల్ గా టాలెంటెడ్ కావడంతో ఆయా కథలను నెక్ట్స్ లెవెల్ కు తీసుకు వెళ్లి అతి తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ న్యూ స్టార్ గా మారాడు. రీసెంట్ గా వచ్చిన నోటా నిరాశపరిచినా అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే విజయ్ దేవరకొండకు కేవలం ఆడియన్స్ లోనే కాదు.. ఇండస్ట్రీలో కూడా అదే స్థాయి క్రేజ్ ఉంది అనడానికి నిదర్శనం ఇవాళ మొదలైన కొత్త సినిమా ప్రారంభానికి వచ్చిన గెస్ట్ లే కారణం. సెన్సిబుల్ మూవీస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించబోయే ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కెఎస్ రామారావు నిర్మిస్తున్నారు. ఇది ఆ బ్యానర్ లో వస్తోన్న 46వ సినిమా కావడం విశేషం. ఇదే బ్యానర్ లో గతంలో క్రాంతిమాధవ్ తీసిన మళ్లీమళ్లీ ఇది రానిరోజు ఎంతపెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ మూవీకి సంగీతం అందించిన గోపీ సుందరే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.  విజయ్ సరసన రాశిఖన్నా, ఐశ్వర్య రాజేశ్, ఇజాబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజయ్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తోన్న ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. ఇక ఈ ఓపెనింగ్ సెరెమనీకి టాలీవుడ్ లోని అతిరథ మహారథులంతా హాజరుకావడం.. అది కూడా పండగరోజు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మొత్తంగా విజయ్ దేవరకొండ క్రేజ్ ను ఈ ఓపెనింగ్ సెరెమనీ చెప్పకనే చెబుతుందనుకోవచ్చు.
 

More Related Stories