English   

బాబాయ్, అబ్బాయ్.. భలే ఉన్నారబ్బాయ్

Kalyan-Ram
2018-10-18 19:45:20

తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారకరామారావు బయోపిక్‘‘ ఎన్టీఆర్’’ రోజురోజుకూ ఇంట్రెస్ట్ పెంచుతోంది. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ అన్నగారి నటనా వైదుష్యం ఉంటుంది. తర్వాత రాజకీయ అరంగేట్రంతో పాటు ఆయన సృష్టించిన సంచలనాలు కనిపించబోతున్నాయి. మొదటి భాగం ‘ఎన్టీఆర్ మహానటుడు’ జనవరి 9న విడుదలవుతోంది. రెండవ భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ జనవరి 24న రాబోతోంది. అయితే ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఓ అదిరిపోయే స్టిల్ విడుదల చేశారు. టాలీవుడ్ లోని అత్యంత ప్రముఖులతో పాటు చిన్నా పెద్దా ఆర్టిస్టులూ ఆనాటి నటులుగా వెండితెరపై కనిపించబోతోన్నారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. పైగా ఎన్టీవోడి గా బాలయ్య లుక్ ప్రతిసారీ మెస్మరైజ్ చేస్తూనే ఉంది.  

అన్నగారి రాజకీయరథానికి సారథి హరికృష్ణ. ఆ ఇద్దరి మధ్య తండ్రి కొడుకులకు మించిన అనుబంధం కనిపిస్తుందని దగ్గర్నుంచి చూసిన ఎవరైనా చెబుతారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లినప్పుడు వేల కిలోమీటర్ల దూరం తానొక్కడే చైతన్య రథం నడిపిన హరికృష్ణ తండ్రి నీడలా నిలిచాడు. ఇప్పుడా పాత్రను కళ్యాణ్ రామ్ పోషిస్తున్నాడు. ఆ లుక్ ను ఈ దసరా సందర్భంగా విడుదల చేశారు. విజయం మీది.. విజయరథ సారధ్యం నాది..నీడలా వెన్నంటి వుంటా నాన్నగారూ.. అంటూ ఎన్టీఆర్ తో హరికృష్ణ డీప్ గా మంతనాలు చేస్తున్నట్టుగా ఉన్న ఈ స్టిల్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

More Related Stories