English   

శర్వా, సాయిపల్లవి ఏదో మాయ చేసేలా ఉన్నారే

Padi-Padi-Leche-Manasu
2018-10-18 20:19:36

కొన్ని కాంబినేషన్స్ అనౌన్స్ మెంట్ లోనే ఆసక్తిని పెంచుతాయి. అలాంటిదే హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా. శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న  ఈ లవ్ స్టోరీకి ‘పడిపడి లేచెను మనసే’ అనే టైటిల్ మరింత వన్నె తెచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్  ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది.   ఇక దసరా సందర్భంగా ఆ టీజర్ మేకింగ్ వీడియో ను విడుదల చేశారు. 

శర్వానంద్.. కెరీర్ ఆరంభంలోనే వైవిధ్యమైన కథలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తగా వస్తోన్న కథలకు, హీరోలకు అతనే ఒకరకమైన ఇన్సిస్పిరేషన్ కూడా. రన్ రాజా రన్ తో ట్రెండ్ మార్చిన శర్వా కెరీర్ ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. అటు సాయిపల్లవి కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో లక్కీ బ్యూటీగా మారింది. లవ్ స్టోరీస్ ను తెరకెక్కించడంలో హను రాఘవపూడి స్టైల్ వేరే. మొత్తంగా టాలెంట్ ప్యాక్ తో వస్తోన్న ఈ మూవీపై ముందు నుంచీ ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి ఉంది. 

ఆ మధ్య విడుదల చేసిన భలే ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆ టీజర్ మేకింగ్ వీడియోను దసరా సందర్బంగా విడుదల చేశారు. చాలా సరదాగా ఉంది. ఇకఈ సినిమా 90స్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే శర్వా ఆహార్యం కూడా ఆకట్టుకుంటోంది. డిసెంబర్ మూడో వారంలో విడుదల కాబోతోన్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయ్.

More Related Stories