English   

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్

Nikhil-nivetha
2018-10-19 12:57:21

తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. ఇప్పటి వరకూ ఫంకీ మూవీస్ తో పాటు కాస్త కమర్షియల్, కాస్త డిఫరెంట్ సినిమాలు చేసిన నిఖిల్ ఫస్ట్ టైమ్ లో ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. అతనికి తోడుగా మరో క్రేజీ బ్యూటీ కూడా నటిస్తుండటంతో ఈ కాంబినేషన్ ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. మరి నిఖిల్ సరసన నటించే ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. నివేదా థామస్.  నిఖిల్.. ఈ మధ్య కాస్త వైవిధ్యమైన సినిమాలు చేస్తోన్న హీరో. గత రెండు సినిమాలు ఇబ్బంది పెట్టినా కుర్రాడు టాలెంటెడ్. ప్రస్తుతం ముద్ర అనే సినిమా చేస్తున్నాడు నిఖిల్. ఈ మూవీ నవంబర్ లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఓ ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ లవ్ స్టోరీలో నిఖిల్ కు జోడీగా నివేదా థామస్ నటిస్తుండటం విశేషం. టాలెంటెడ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంది నివేదా. హిట్లూ ఉన్నాయి. కానీ అందుకు తగ్గట్టగా అవకాశాలు రావడం లేదు. అయితే నిఖిల్ తో చేస్తోన్న సినిమా నివేద కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందనుకుంటున్నారు. ఇక కృష్ణేన్ కట్టా డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి టైటిల్ ఏంటో తెలుసా.. ‘శ్వాస’. అక్టోబర్ 19న ఈ మూవీ ఓపెనింగ్ గ్రాండ్ గా జరగబోతోంది. మరి ఈ క్రేజీ కపుల్ ప్యూర్ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో చూడాలి. 

More Related Stories