English   

ఈ ప్రేమకథా సీక్వెల్ వర్కవుట్ అవుతుందా..?

Prema-Katha-Chitram-2
2018-10-19 15:08:05

టాలీవుడ్ లో సీక్వెల్స్ పెద్దగా కలిసి రాలేదు. అయినా కొందరు అప్పుడప్పుడూ టచ్ చేస్తూనే ఉన్నారు.  ఇప్పుడు మరో సీక్వెల్ కు స్క్రిప్ట్ సిద్ధమైంది. కొన్నాళ్ల క్రితం తెలుగులో హారర్ మూవీస్ ట్రెండ్ ను అమాంతంగా మార్చేసిన సినిమా ప్రేమకథా చిత్రమ్. సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికీ హిలేరియస్ గానే ఉంటుంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీపై అప్పట్లో దర్శకుడి విషయంలో కొన్ని వివాదాలూ వచ్చాయి. ఫైనల్ గా మారుతి ఖాతాలో పడ్డ ఈ బ్లాక్ బస్టర్ నిజంగానే అప్పట్లో ఓ ఊపుఊపేసింది. దెయ్యం సినిమా అన్న ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరినీ థియేటర్ లో పడిపడి నవ్వుకునేలా చేసింది. ఈ మూవీతోనే కమెడియన్ సప్తగిరి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అటు ప్రవీణ్ రేంజ్ కూడా మారింది. సుధీర్ బాబుకు ఫస్ట్ హిట్ పడింది. అలాంటి మూవీకే ప్రస్తుతం సీక్వెల్ రెడీ అవుతోంది.   ఇక హారర్ మూవీస్ లో హ్యూమర్ ను యాడ్ చేసి ప్రేమకథాచిత్రమ్ చేసిన హంగామా ఓ ట్రెండ్ అయింది. ఇప్పటికీ ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతోంది. ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాలో దెయ్యం పట్టిన భామగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న నందిత శ్వేత ఈ సారి ప్రధాన పాత్రలో నటిస్తోంది. మరి ఈ సీక్వెల్ సెంటిమెంట్ లో కలిసిపోతుందా.. లేక ఆ సినిమాలా ట్రెండ్ క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి. 

More Related Stories