English   

రాజుగారికి మ‌ళ్లీ త‌ప్పేలా లేదుగా..

Dil-Raju
2018-10-19 16:59:43

ఎలాంటి వాళ్ల‌కైనా ఇండ‌స్ట్రీలో గోల్డెన్ పీరియ‌డ్ ఒక‌టి ఉంటుంది. ఆ టైమ్ లో యావ‌రేజ్ సినిమాలు చేసినా కూడా సూప‌ర్ హిట్ అయిపోతుంటాయి. 2017లో దిల్ రాజుకు అదే న‌డిచింది కూడా. ఆ ఏడాది ఆరు సినిమాలు వ‌స్తే అందులో డిజే, ఎంసిఏతో పాటు రాజా ది గ్రేట్ కూడా ఆ టైమ్ కు సుడి బాగుండి బండి లాక్కొచ్చేసాయి. దాంతో తానేం క‌థ ఓకే చేసినా సూప‌ర్ హిట్టే అని ఫిక్స్ అయిపోయాడు దిల్ రాజు. అయితే 2018లో ఆ మబ్బులు త్వ‌ర‌గానే విడిపోయాయి. ముందు ల‌వ‌ర్ తో.. ఆ త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన శ్రీ‌నివాస క‌ళ్యాణంతో రెండు వ‌ర‌స షాకులు తిన్నాడు దిల్ రాజు. దాంతో ఇప్పుడు హ‌లో గురు ప్రేమ‌కోస‌మేతో ఎలాగైన హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు ఈ నిర్మాత‌. అయితే ఇప్పుడు విడుద‌లైన ఈ చిత్రానికి కూడా టాక్ తేడాగా వ‌చ్చేసింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ సినిమా హిట్ అయ్యేలా క‌నిపించ‌డం లేదు. ప‌ర‌మ రొటీన్ క‌థ‌తో వ‌చ్చిన ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు తొలిరోజే యావ‌రేజ్ మార్క్ గుద్దేసారు. 

ఈ టాక్ తో సినిమా ఎంత‌దూరం వెళ్తుంద‌నేది అనుమానంగా మారింది. అస‌లు ఏ మాత్రం కొత్త‌ద‌నం లేకుండా ఫ‌స్ట్ సీన్ లోనే లాస్ట్ సీన్ చెప్పేంత పాత క‌థ‌తో సినిమా తీసుకురావ‌డంతో అక్క‌డ‌క్క‌డా కామెడీ ఉన్నా కూడా స‌రిపోలేదు. పైగా ఒక‌ప్పుడు దిల్ రాజు సినిమా అంటే ఎగ‌బ‌డి కొనేవాళ్లు కూడా ఇప్పుడు ల‌వ‌ర్.. శ్రీ‌నివాస క‌ళ్యాణం త‌ర్వాత దిల్ రాజు సినిమా అంటే ఎందుకో ఆలోచ‌న‌లో ప‌డుతున్నారు బ‌య్య‌ర్లు. అయినా కూడా ఈ చిత్రాన్ని 24 కోట్ల‌కు అమ్మాడు దిల్ రాజు. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు త‌లుచుకుంటుంటేనే భ‌యంగా ఉంది. అక్టోబ‌ర్ 18న ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం క‌చ్చితంగా ఓపెనింగ్స్ తెచ్చుకున్నా త‌ర్వాత ఏంటి ప‌రిస్థితి అనేది అర్థం కావ‌డం లేదు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, ప్ర‌ణీత ఇందులో రామ్ తో జోడీ క‌ట్టారు. మొత్తానికి చూడాలిక‌.. రాజుగారి ప్ర‌యాణం ఎలా మార‌నుందో..?      

More Related Stories