English   

మ‌రో మ‌హాన‌టిని సిద్ధం చేస్తున్న క్రిష్.. 

Nithya-Menen
2018-10-19 19:43:09

సావిత్రి అంటే ఒక‌ప్పుడు ఆ మ‌హాన‌టి గుర్తొచ్చేది.. కానీ ఈ మ‌ధ్య అభిన‌వ సావిత్రిగా కీర్తిసురేష్ న‌ట‌న‌కు అంతా ఫిదా అయిపోయారు. నిజంగానే సావిత్రి ఆత్మ కీర్తిలో ఉందేమో అనేంత‌గా ఆమెను త‌న‌లో చేర్చుకుంది కీర్తి. మ‌హాన‌టి కేవ‌లం కీర్తిసురేష్ న‌ట‌న వ‌ల్లే అంత పెద్ద విజ‌యం సాధించిందంటే అతిశ‌యోక్తి కాదు. భావి త‌రాల‌కు సావిత్రి ఎవ‌రు అంటే మ‌రోమాటే  లేకుండా కీర్తి పేరు గుర్తొస్తుంది. అంత‌గా ఆ పాత్ర‌లో ఒదిగిపోయి ప్ర‌శంస‌లు అందుకుంది ఈ ముద్దుగుమ్మ‌. అయితే ఇదే పాత్ర ఇప్పుడు మ‌రోసారి కీర్తిని వెతుక్కుంటూ వ‌చ్చింది. ఎన్టీఆర్ బ‌యోపిక్ కోసం మ‌రోసారి సావిత్రి పాత్ర‌లో న‌టించాల‌ని కోరారు. కానీ ఎంత అడిగినా కూడా ఈ సినిమాలో న‌టించ‌డానికి కీర్తి ఒప్పుకోలేదు. దాంతో ఇప్పుడు నిత్యామీన‌న్ ను ఈ పాత్ర కోసం తీసుకున్నారు.  ఇంకా విడుద‌ల కాలేదు ఈ లుక్ కానీ.. ఒక్క‌సారి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత అస‌లు నిత్యామీన‌న్ కంటే బాగా సావిత్రి రోల్ కు ఎవ‌రు స‌రిపోతారు అనేలా క్రిష్ ఇందులో ఆమెను చూపిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఆ ఫ‌స్ట్ లుక్ కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. గుండ‌మ్మ క‌థ‌లో పిండిరుబ్బే సీన్ తో ఫ‌స్ట్ లుక్ డిజైన్ చేసిన‌ట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో సావిత్రి పాత్ర కూడా కీల‌క‌మే. ఈ పాత్ర కోసం కీర్తిని అనుకున్నా ఇప్పుడు నిత్యాతో స‌రిపెట్టుకున్నారు. కానీ ఈ లుక్ విడుద‌లైన త‌ర్వాత నిత్యా కంటే ఎవ‌రూ బాగా సెట్ కాలేర‌ని ప్రేక్ష‌కులు అంటార‌ని ధీమాగా చెబుతున్నాడు క్రిష్. అన్న‌ట్లు మ‌హాన‌టి కోసం కూడా ముందు నిత్యామీన‌న్ ను అనుకున్న త‌ర్వాత కీర్తి వైపు క‌దిలాడు నాగ్  అశ్విన్. ఇప్పుడు మ‌ళ్లీ వెతుక్కుంటూ సావిత్రి రోల్ నిత్యా ద‌గ్గ‌రికే వ‌చ్చింది. 

More Related Stories