English   

నాగ్ అశ్విన్ ను ప‌ట్టుకుంటున్న నాని.. 

Nani
2018-10-19 19:51:18

నాని-నాగ్ అశ్విన్.. ఈ కాంబినేష‌న్ కు మంచి క్రేజ్ ఉంది. నానితో సినిమా చేయ‌డం వ‌ల్ల నాగ్ అశ్విన్ కు ఏమొచ్చిందో తెలియ‌దు కానీ నాని కెరీర్ మాత్రం మారిపోయింది. వ‌ర‌స‌గా నాలుగు ఫ్లాపుల‌తో ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం చేసాడు నాగ్ అశ్విన్. అది ఆయ‌న‌కు తొలి సినిమానే కానీ నానికి మాత్రం ప్రాణం పోసిన సినిమా. ఆ సినిమాతోనే అశ్వినీద‌త్ బ్యానర్ నుంచి చాలా ఏళ్ల త‌ర్వాత సినిమా వ‌చ్చింది. ఎవ‌డే త‌ర్వాత నాని కెరీర్ రెక్క‌లు తెగిన గాలిపటంలా హాయిగా ఎగిరింది.. ఎదిగింది కూడా. మూడేళ్లు 8 విజ‌యాల‌తో దూసుకొచ్చాడు నాని. ఇక ఇప్పుడు మ‌ళ్లీ రెండు ఫ్లాపుల‌తో రేస్ లో వెన‌క‌బ‌డిపోయాడు నాని. 

ఈ ఏడాది కృష్ణార్జున యుద్ధంతో పాటు దేవ‌దాస్ కూడా ఫ్లాప్ అయ్యేస‌రికి మ‌ళ్లీ నాగ్ అశ్విన్ వైపు చూస్తున్నాడ‌ని తెలుస్తుంది. పైగా ఈయ‌న మ‌హాన‌టి త‌ర్వాత ఇంకా ఏ సినిమాకు క‌మిట్ కాలేదు. దాంతో త‌న కోసం క‌థ సిద్ధం చేయాల‌ని అశ్విన్ కు నాని సూచించిన‌ట్లు తెలుస్తుంది. మొన్న దేవ‌దాస్ ప్రెస్ మీట్ లో కూడా ఇదే విష‌యం చెప్పాడు నాని. త‌న‌కోసం నాగ్ అశ్విన్ క‌థ సిద్ధం చేస్తున్నాడంటూ న‌వ్వుతూ చెప్పాడు. న‌వ్వుతూ చెప్పిన ఇది సీరియ‌స్సే. ఎందుకంటే చాలా ఏళ్ళ త‌ర్వాత నానితోనే వైజ‌యంతి నుంచి సినిమా వ‌చ్చి హిట్ కొట్టారు.. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌నతోనే సినిమా చేసారు.. మ‌రో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రి మ‌హాన‌టి త‌ర్వాత నాగీ సినిమా అంటే అంచ‌నాలు భారీగా ఉంటాయి. మ‌రి అదెలా ఉంటుందో చూడాలిక‌..!

More Related Stories