English   

ఓటు నీ ఆయుధం అంటున్న‌ స‌ర్కార్..

Vijay-Sarkar
2018-10-20 12:07:57

స‌ర్కార్ అంటే ప్ర‌భుత్వం అని అర్థం. ఇప్పుడు విజ‌య్ న‌టిస్తున్న సినిమాకు కూడా ఇదే టైటిల్ పెట్టాడు మురుగ‌దాస్. ఈ చిత్రంపై అక్క‌డ ఇక్క‌డ భారీ అంచ‌నాలున్నాయి. ఇక ఇప్పుడు విడుద‌లైన ఈ చిత్ర టీజ‌ర్ చూస్తుంటే సినిమా కాన్సెప్ట్ ఏంటో అర్థ‌మైపోతుంది. మ‌రో రెండు నెల‌ల్లో ఎల‌క్ష‌న్స్ వ‌స్తున్న ఈ త‌రుణంలో ఓటుహ‌క్కు ప్రాముఖ్య‌త తెలిపేలా ఈ సినిమా క‌థ ఉండ‌బోతుంది. ఇందులో విజ‌య్ కార్పోరేట్ కింగ్ గా న‌టిస్తున్నాడు. త‌న ఓటును మ‌రొక‌రు దొంగ‌త‌నంగా వేయ‌డంతో అక్క‌డ్నుంచి క‌థ మొద‌ల‌వుతుంది. గ‌వ‌ర్న‌మెంట్ చేస్తోన్న త‌ప్పుల‌ను నిల‌దీసేలా ఈ పాత్ర ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే విజ‌య్ ఇలాంటి పాత్ర‌లు చేసాడు. గ‌తేడాది ఈయ‌న న‌టించిన మెర్స‌ల్ లో జిఎస్టీతో పాటు ఇంకా చాలా ఇష్యూస్ ను ప్రేక్ష‌కుల‌కు తెలియ‌చేసాడు. ఇప్పుడు మ‌రోసారి మురుగ‌దాస్ తో క‌లిసి ఇలాంటి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు. 

ఈ సారి ఇంకాస్త సీరియ‌స్ గా ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల‌పై నోరు విప్ప‌బోతున్నాడు ఈ హీరో. పైగా ఓటును త‌ప్పుగా వాడుకుంటున్న ప్ర‌జ‌ల‌కు కూడా ఈ సినిమా క‌నువిప్పుగా ఉంటుంద‌ని తెలుస్తుంది. అస‌లే త‌మిళ‌నాట విజ‌య్ ఇమేజ్ మాట‌ల్లో చెప్ప‌డం క‌ష్టం. మెర్స‌ల్ ర‌చ్చతో నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయ్యాడు విజ‌య్. ఇక ఇప్పుడు ర‌జినీకాంత్ త‌ర్వాత ఈయ‌నే అనేంత‌గా ఇప్పుడు అక్క‌డ మార్కెట్ ఉంది. ర‌జినీ ఇప్పుడు వ‌ర‌స డిజాస్ట‌ర్స్ ఇస్తున్నాడు కాబ‌ట్టి అన్ అఫీషియ‌ల్ నెంబ‌ర్ వ‌న్ కూడా ఇప్పుడు విజ‌యే. విజ‌య్-మురుగ‌దాస్ కాంబోలో వ‌స్తోన్న మూడో సినిమా ఇది. దీనికి ముందు తుపాకిలో స్లీప‌ర్ సెల్స్ గురించి.. క‌త్తిలో రైతుల గురించి చెప్పాడు మురుగదాస్. ఇప్పుడు మాఫియాను ముందుకు తీసుకొస్తున్నాడు. 

పైగా స్పైడ‌ర్ త‌ర్వాత చేస్తోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే స్పైడ‌ర్ డిజాస్ట‌ర్ మురుగ‌దాస్ ఇమేజ్ ను బాగా దెబ్బ‌తీసింది. ఇప్పుడు క‌చ్చితంగా విజ‌య్ సినిమాతో హిట్ కొట్టాల్సిన ప‌రిస్థితికి వ‌చ్చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక్క‌డ ఓ సెంటిమెంట్ మురుగ‌దాస్ కు బ‌లాన్నిస్తుంది. క‌త్తి.. తుపాకికి ముందు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు మురుగ‌దాస్. విజ‌య్ తో సినిమా చేసి ఫామ్ లోకి వ‌చ్చాడు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుందనే న‌మ్మ‌కంతో ఉన్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ కు రెస్పాన్స్ బాగుంది. కీర్తిసురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న స‌ర్కార్ లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ విల‌న్ గా న‌టిస్తుంది. న‌వంబ‌ర్ 6న స‌ర్కార్ విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఈ సినిమాతో విజ‌య్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తాడో..?

More Related Stories