English   

బాలయ్య ఊహించని షాక్ ఇచ్చాడుగా..?

Balakrishna
2018-10-20 12:48:53

నందమూరి అభిమానులంతా ఆ ఫ్యామిలీ హీరోలను అభిమానిస్తారు. కానీ ఆ ఫ్యామిలీ స్టార్స్ లో కొందరి రూట్ డిఫరెంట్. కొన్నాళ్ల క్రితం బాగా దూరంగా ఉన్నా.. మళ్లీ కలిశారు. తర్వాత విడిపోయారు. మధ్యలో మాటల తూటాలూ పేల్చుకున్నారు. అఫ్ కోర్స్ సీనియర్ హీరో మాటలు అన్నా ‘జూనియర్’ హీరోలు మాత్రం కాస్త తగ్గే ఉన్నారు. మొత్తంగా గత కొన్నాళ్లుగా ఉప్పు నిప్పుగా ఉన్న బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ కలవబోతున్నారు. యస్.. మీరు చదివింది కరెక్టే. ఎన్టీఆర్ కోసం బాలయ్య వస్తున్నాడు. 

రీసెంట్ గా హరికృష్ణ చనిపోయినప్పుడు బాలయ్య ఆ కుటుంబానికి చాలా అండగానే నిలిచాడు. హరికృష్ణ మరణానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ అయిపోయేంత వరకూ ఆ ఇంట్లోనే ఉన్నాడు. అందరితోనూ మాట్లాడాడు. ముఖ్యంగా అప్పుడు ఆయన ఎన్టీఆర్ తో కలివిడిగా ఉండటం నందమూరి అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. ఆ కలయిక తర్వాత తారక్ లేటెస్ట్ మూవీ అరవింద సమేతవీరరాఘవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు బాలయ్య చీఫ్ గెస్ట్ గా వస్తాడనుకున్నారు. బట్ ఆయన రాలేదు. దీంతో వీళ్ల ఆ కొన్ని రోజులు మాత్రమే కలిసున్నారు. కానీ కోపాలు తగ్గలేదేమో అనుకున్నారు. బట్.. కళ్యాణ్ రామ్ బాలయ్య కొత్త సినిమా పెద్దాయన బయోపిక్ పిక్ ‘‘ఎన్టీఆర్’’లో హరికృష్ణ పాత్ర చేస్తున్నాడు. ఆ ఎఫెక్ట్ వల్లో ఏమో.. ఇప్పుడు బాలయ్య ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. 

యస్.. అరవింద సమేతవీరరాఘవ సినిమా సక్సెస్ మీట్ కు బాలయ్య చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. ఈ ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగబోతోన్న అరవింద సమేత సక్సెస్ మీట్ కు బాలయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి రాబోతున్నాడు. దీంతో ఎన్నాళ్లో వేచిన సాయంత్రం నందమూరి అభిమానులకు మరోసారి ఎదురుకానుంది. మొత్తంగా ఒకేవేదికపై బాలయ్య, తారక్, కళ్యాణ్ రామ్ లు కనిపించబోతున్నారు. అయితే ఈ ఫంక్షన్ లో బాలయ్య ఏం మాట్లాడతాడా అనే ఆసక్తి అందిరలోనూ ఉంది. మరి ఈ కలయికైనా లాంగ్ టైమ్ కంటిన్యూ అవుతుందేమో చూడాలి. 

More Related Stories