English   

అల్లు అర్జున్ అదరగొట్టాడబ్బా

Allu-Arjun
2018-10-20 20:02:58

రీల్ హీరోలు రియల్ హీరోలు అనపించుకునే టైమ్ చాలా అరుదుగా వస్తుంది. అలా వచ్చినప్పుడు వాళ్లు స్పందించే విధానాన్ని బట్టి అభిమానులు కూడా రియాక్ట్ అవుతుంటారు. అలాగే కొత్త అభిమానులూ పుట్టుకొస్తారు. మామూలుగా ప్రతి ప్రకృతి విపత్తులప్పుడూ స్పందిస్తుంది మన టాలీవుడ్. రీసెంట్ గా కేరళలో వచ్చిన వరదలప్పుడు కూడా ముందుగా స్పందించింది టాలీవుడే కావడం విశేషం. అయితే ఈ సారి మన తెలుగు రాష్ట్రం శ్రీకాకుళం తిత్లీ తుఫాన్ తో అతలాకుతలం అయితే మాత్రం ఆ స్థాయిలో స్పందన రాలేదు. హీరో సంపూర్ణేష్ బాబు ఫస్ట్ స్పందించిన సెలబ్రిటీ కావడం విశేషం. అతను 50వేలు ఇచ్చాడు. తర్వాత విజయ్ దేవరకొండ.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. రీసెంట్ గా బాలయ్య.. వీళ్లంతా కాస్త టైమ్ తీసుకున్నా.. తమ మంచి మనసు చాటుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా శ్రీకాకుళం తుఫాన్ బాధితుల కోసం భారీగా స్పందించాడు.

తిత్లీ తుఫాన్ ధాటికి శ్రీకాకుళం విలవిల్లాడింది. కేరళకు ఇచ్చినంత కవరేజ్ కూడా మీడియా దీనికి ఇవ్వలేదు. అయినా వాళ్లు ధైర్యంగా విపత్తును ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అక్కడి బాధితుల కోసం సిఎమ్ సహాయనిధికి 25లక్షల విరాళం ప్రకటించాడు. ఈ మొత్తం సిఎమ్ సహాయనిధికి అందించాడు. ప్రస్తుతం సినిమాలేం చేయకుండా ఖాళీగానే ఉంటున్నాడు అల్లు అర్జున్. త్వరలోనే త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెడతారు అనే వార్తలు వస్తున్నా.. ఈ విషయం ఇద్దరిలో ఎవరూ కన్ఫార్మ్ చేయడం లేదు. మొత్తంగా బన్నీ చేసిన సహాయం తర్వాత మరికొంతమందిలో కదలిక వస్తుందేమో చూడాలి. 

More Related Stories