English   

అర్జున్ ఆ హీరోయిన్ ను అందరిముందూ కెలికాడట

Sruthi-Hariharan
2018-10-20 13:17:51

అనుకుంటాం కానీ కొందరు పైకి కనిపించినంత ‘జెంటిల్మన్’లేం కాదు. టైమ్ వస్తే కానీ వారి స్వరూపాలు తెలియవు. ఇప్పుడు మీటూ పుణ్యమా అని ఒక్కొక్కరి బాగోతం బయటపడుతుంది. ఇందులో ఆరోపణలన్నీ హండ్రెడ్ పర్సెంట్ నిజాలే అనుకోలేం. అలాగని కాదు అనకూడదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే అంటూ చాలా క్యాజువల్ గా చెప్పుకునే సమాజం మనది. కానీ ఆ క్యాజువల్ సంఘటన మన ఇంట్లోవారికి జరిగితే మాత్రం హీరో లెవెల్లో బిల్డప్ ఇస్తాం. అలా కాకుండా కాస్త సావధానంగా ఆలోచిస్తే.. అవకాశాల కోసమో.. లేక డామినేటింగ్ కోసమో మహిళలను వేధించేవారు చాలామందే ఉన్నారు. అలాంటి వారి జాబితాలోకి మన జెంటిల్మన్ యాక్షన్ కింగ్ అర్జున్ షార్జా కూడా చేరాడు. యస్.. అర్జున దాదాపు 50 మంది క్రూ ముందు తనను రిహార్సల్ పేరుతో వేధించాడని కన్నడ హీరోయిన్ శ్రుతి హరిహరణ్ చేసిన ఆరోపణలు సంచలన సృష్టిస్తున్నాయి. 

శ్రుతి హరిహరణ్ సైడ్ డ్యాన్సర్ నుంచి హీరోయిన్ అయిన భామ. పెద్దగా బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు. ఇదే అదనుగా తనపై గతంలోనూ చాలా వేధింపులు జరిగాయి. ఈ విషయం గతేడాదే తను మీటూ ఉద్యమం మొదలు కావడానికి ముందే ఓపెన్ గా చెప్పింది. ఇప్పుడు అర్జున్ షార్జా తనను 2016లో ఓ సినిమా షూటింగ్ లో రిహార్సల్స్ చేస్తుండగా తన పర్మిషన్ లేకుండా సడెన్ గా అసభ్యంగా తాకాడంటూ ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ సెన్షేషన్ అవుతోంది. అది ఓ ట్రై లింగ్వుల్ ఫిల్మ్. శ్రుతి.. అర్జున్ కు భార్యగా నటించిందీ సినిమాలో. అయితే రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు అందరి ముందూ శ్రుతిని వెనక నుంచి లాక్కుని.. పైనుంచి పిరుదుల వరకూ అసభ్యంగా తాకుతూ.. ఎదపైనా చేతులు వేసి అసహ్యంగా బిహేవ్ చేశాడని ఆరోపించింది. అంతే కాదు.. అలా చేస్తూనే దర్శకుడితో ఇలాంటి సీన్ ఒకటి పెట్టండి.. ‘‘ఫోర్ ప్లే’’లో ఉన్నట్టుగా ఉంటుంది అన్నాడట. ఇదంతా అక్కడ 50మంది క్రూ చూస్తుండగానే చేశాడట. 

ఇక ప్రస్తుతం 54యేళ్ల వయసులో ఉన్న అర్జున్ ఇప్పటికే 150 సినిమాలు చేశాడు. అలాంటి వ్యక్తిపై ఆరోపణ అంటే చిన్న విషయం కాదు. అయితే ఈ విషయంపై అర్జున్  స్పందన కోరితే మాత్రం ‘‘ఇదంతా బేస్ లెస్. ఆధారం లేని ఆరోపణ. తనపై కావాలనే చేస్తున్నారు. వినగానే నేనూ షాక్ అయ్యాను’’ అంటూ రొటీన్ డైలాగులే చెప్పాడు. మరోవైపు అర్జున్ కూతురు కూడా కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అతని ఇద్దరు మేనళ్లుల్లు అక్కడ హీరోలే. మరి ఈ మీటూ వ్యవహారంలో అతనిపై వచ్చిన ఆరోపణలకు వారి ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

More Related Stories