English   

రవితేజ వర్సెస్ విజయ్ దేవరకొండ 

Vijay-Ravi-Teja
2018-10-20 20:48:04

టాలీవుడ్ సడెన్ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ టాక్సీవాలా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. గీత గోవిందం కంటే ముందే పూర్తయిన ఈ మూవీని రకరకాల కారణాలతో హోల్డ్ లో పెట్టారు. మొదట్లో గ్రాఫిక్స్ కాలేదనీ.. విఎఫ్ఎక్స్ అనుకున్నంత ఎఫెక్టివ్ గా రాలేదని చెబుతూ వచ్చారు. కానీ ఇంటర్నల్ గా మాత్రం సినిమా బాగా రాలేదనే టాక్ ఉండేది. మొత్తంగా మైనస్ లన్నీ కవర్ చేసినట్టున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అర్జున్ రెడ్డి తర్వాత రావాల్సిన టాక్సీవాలాపై కూడా భారీగానే అంచనాలు పెంచారు. ఇప్పుడు గీత గోవిందంతో వంద కోట్ల క్లబ్ లో కూడా చేరాడు కాబట్టి.. అవి ఇంకా పెరుగుతాయి. కానీ మధ్యలో నోటా డిజాస్టర్ కావడంతో ఈ సినిమాను సడెన్ గా వదులుతున్నారు అనేవారూ లేకపోలేదు. బట్.. ఈ టాక్సీవాలా రిజల్ట్ ఏమైనా తేడా కొడితే మాత్రం విజయ్ దేవరకొండ ఇమేజ్ తగ్గడం ఖాయం. మరి అన్నీ చూసుకునే విడుదల చేస్తున్నారా లేదా అనేది తెలియదు కానీ.. టాక్సీవాలా నవంబర్ 16న విడుదల చేస్టున్నట్టు ప్రకటించారు. 

టాక్సీవాలా వస్తోన్న నవంబర్ 16నే మాస్ మహరాజ్ రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ కూడా వస్తుండటం విశేషం. ఇండస్ట్రీలో కొన్ని సిమిలాటీస్ లో విజయ్ దేవరకొండ కూడా రవితేజ లా హార్డ్ వర్క్ తో పైకి వస్తోన్న వాడిగానే చెప్పుకున్నారు. కాకపోతే విజయ్ స్పీడ్ వేరే ఉంది. అయితే రవితేజ పరిస్థితి ఇప్పుడంత బాలేదు. అలాగే ఆ చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల కూడా వరుస డిజాస్టర్స్ తో ఉన్నారు. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ మూవీతో ఇలియానా టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది. ఇది పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనరే అయినా కాస్త ట్విస్టులు కూడా ఉంటాయి అంటున్నారు. అవి వర్కవుట్ అయితే అమర్ అక్బర్ ఆంటోనీ గట్టెక్కినట్టే.. 

ఇక విజయ్ దేవరకొండ టాక్సీవాలా కు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. గతంలో ఓ హారర్ మూవీ తీసిన రాహుల్ కు ఇది రెండో సినిమా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ గతంలోనే సెన్సార్ కూడా పూర్తయింది. యూ/ఏ సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్న టాక్సీవాలాలో అర్జున్ రెడ్డి తరహా కొన్ని హాట్ సీన్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. మొత్తంగా సడెన్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వెనక ఉద్దేశ్యమేంటో కానీ.. ఆ మూవీ వెళ్లి రవితేజ సినిమాకు పోటీగా నిలవడంతో కాంపిటీషన్ ఇంట్రెస్టింగ్ గా మారింది. 

More Related Stories