English   

ప్రభాస్ మరో సాహసం చేస్తున్నాడు

Prabhas Doing Risky Action Stunts For Saaho Without Any Doob
2018-10-21 07:30:24

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ లో ఏమేరకు మారిపోయిందో అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ అయ్యాడు. ఇటు నేషనల్ వైడ్ గానూ చాలామందికి అభిమాన నటుడయ్యాడు. అందుకే ఆ అందరి అభిమానాన్ని మరింతగా అందుకోవాలనే సాహో సినిమాను బాలీవుడ్ లోనూ చేస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ లోనూ ఒకేసారి నిర్మితమవుతోన్న ఈ మూవీకి సుజిత్ దర్శకుడు. ఇతను గతంలో రన్ రాజా రన్ ఒకేఒక్క సినిమా తీసి ఉన్నాడు. అయినా అతన్ని బలంగా నమ్మింది యువీ క్రియేషన్స్  సంస్థ, పైగా సుజిత్ ఆ టీమ్ కు బాగా దగ్గరవాడు కావాల్సినవాడు అని అప్పట్లోనే అర్థమైంది. మొత్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న సాహో కోసం ప్రభాస్ మరో సాహసం చేస్తున్నాడు.

సాహో సినిమాకు సంబంధించి కొన్నాళ్ల క్రితం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో అత్యంత భారీ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సీన్ కోసం భారీగా ఖర్చు చేశారు. అలాగే ప్రభాస్ కూడా చాలా రిస్కీ సీన్స్ చేశాడనే టాక్ వచ్చింది. ప్రభాస్ డూప్ లేకుండా చేసిన ఆ సీన్స్ చాలా సాహసోపేతంగా ఉంటాయని.. టామ్ క్రూయిజ్ మిషన్ ఇంపాసిబుల్ మూవీ సీన్స్ ను తలపిస్తుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి మరో సాహసోపేతమైన సీన్ నే మళ్లీ చేయబోతున్నాడట ప్రభాస్.

ఈ సారి ఈ భారీ యాక్షన్ అండ్ ఛేజింగ్ సీన్ ను రొమేనియా దేశంలో చిత్రీకరించబోతున్నారు. ఈ సీన్ లో ప్రభాస్ తో పాటు మెయిన్ విలన్ గా నటిస్తోన్న నీల్ నితిన్ ముఖేష్ కూడా ఉంటాడని చెబుతున్నారు. మొత్తంగా ఈ సాహసోపేతమైన సీన్స్ తో దీన్ని ఓ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా మలచబోతున్నారు. మరోవైపు ఈ సినిమాతో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ లవ్ డ్రామాలోనూ నటిస్తున్నాడు ప్రభాస్. మొత్తంగా వచ్చే యేడాది సమ్మర్ లో విడుదల కావొచ్చని చెబుతోన్న సాహోతో ప్రభాస్ రేంజ్ పర్మనెంట్ గా మారుతుంది అని నమ్ముతున్నారు చాలామంది.

More Related Stories