English   

విశాల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్

Pandem-Kodi-2
2018-10-21 15:25:34

విశాల్.. మనోడికి తమిళ్ లో ఎంత మార్కెట్ ఉందో.. తెలుగులోనూ అదే స్థాయిలో ఉంది. కాకపోతే కొన్నాళ్ల క్రితం వరుసగా చేసిన ఊరమాస్ సినిమాలతో ఆ టచ్ కోల్పోయాడు. మళ్లీ ఈ మధ్య కొత్తదనం ఉన్న సినిమాలతో ఫామ్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో తన కెరీర్ లో 25వ సినిమాగా పందెంకోడి రీమేక్ తో వచ్చాడు. ఇది పదమూడేళ్ల క్రితం విశాల్ ను అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోనూ హీరోగా నిలబెట్టిన  సినిమా. అందుకే ఈ మూవీ అంటే అతనికి ప్రత్యేకమైన ఇష్టం. ఇదీ అని చెప్పుకుండా పందెంకోడిలో అన్ని ఎలిమెంట్స్ సూపర్బ్ గా వర్కవుట్ అయ్యాయి. కామెడీ విషయంలో హీరోయిన్ చేసిన అల్లరికి ఆ రోజుల్లో థియేటర్స్ అన్నీ హోరెత్తిపోయాయి. మొత్తంగా ఈ సినిమాపై ఉన్న ప్రత్యేక అభిమానంతో తన 25వసినిమాగా దీని సీక్వెల్ నే ఎంచుకున్నాడు విశాల్. ఈ దసరా పండగ రోజు విడుదలైన పందెంకోడి -2 బాక్సాఫీస్ ను షేక్ చేస్తోందిపుడు.  

తెలుగులో విశాల్ మార్కెట్ తగ్గిందనుకున్నవారికి ఈ పందెంకోడి -2 తిరుగులేని షాక్ ఇచ్చింది. అతని కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే 4కోట్ల 21లక్షలకు పైగా షేర్ వసూలు చేసి రికార్డ్ సృష్టిస్తోంది. విశేషం ఏంటంటే ఈ మూవీ తెలుగు రైట్స్ 6 కోట్లకు కొన్నారు. ఆల్రెడీ మూడు రోజుల్లోనే నాలుగు కోట్లకు పైగా వచ్చింది. ఇక మిగిలింది సాధించడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ థియేటర్స్ లో స్ట్రాంగ్ గా ఉందీ మూవీ.  తెలుగులో విశాల్ సినిమాకు కేవలం మూడు రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. అంటే ఈ మూవీ ఏ స్థాయి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. 

More Related Stories