English   

పవన్ కళ్యాణ్ చెప్పాడు.. రామ్ చరణ్ చేస్తున్నాడు.. 

Ram-Charan
2018-10-21 15:47:17

అయినా మెగా ఫ్యామిలీలో మనస్పర్థలు ఉన్నాయని చెబుతారు.  కానీ ఐడియాస్ లో తేడాలుండొచ్చు కానీ.. రిలేషన్ లో ఎందుకుంటాయి. అందుకే బయట ఎవరెన్ని అనుకున్నా వీళ్లు పట్టించుకోరు.. రియాక్ట్ కారు. టైమ్ వచ్చినప్పుడు హ్యాపీగా కలిసిపోతారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చెప్పాడని.. రామ్ చరణ్ ఓ పెద్ద బాధ్యత తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని తనే ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మరీ చెప్పాడు. ఇంతకీ బాబాయ్ చెప్పగా అబ్బాయ్ ఆనందంగా ఒప్పుకున్న ఆ విషయం ఏంటో తెలుసా.. ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడం. యస్.. రీసెంట్ గా శ్రీకాకుళం జిల్లాలో వచ్చిన తీత్లీ తుఫాన్ వల్ల అక్కడ ఎన్నో గ్రామాలు అతలాకుతలం అయిపోయాయి. 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటిస్తున్నారు. చాలా ప్రాంతాలు పూర్తిగా ఆనవాలు కోల్పోయాయి. ఇప్పటికే మన సెలబ్రిటీస్ వారికి ఏదైనా సాయం చేయడానికి తమవంతుగా కొంత నగదు సిఎమ్ రిలీఫ్ ఫండ్ కు పంపించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం.. అక్కడ దెబ్బతిన్న ఓగ్రామాన్ని దత్తత తీసుకోమని చరణ్ కు సూచించాడట. మరి బాబాయ్ చెప్పడం అబ్బాయ్ కాదనడం ఉంటుందా.. అందుకే వెంటనే ఓకే చెప్పాడట. 

ప్రస్తుతం రామ్ చరణ్ టీమ్ ఒకటి శ్రీకాకుళం పర్యటనలో ఉంది. వాళ్లు అక్కడ ఏ గ్రామాన్ని దత్తత తీసుకోవాలనేది డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి ఆ గ్రామాన్ని మళ్లీ పూర్వ స్థితికి తేవడం చరణ్ బాధ్యత. ఇందుకు సంబంధించి అక్కడ అర్జెంట్ గా ఎంత అవసరం అవుతుందో అది త్వరలోనే తెలియజేస్తానని చెప్పాడు.  ఇది కొంచెం పెద్ద బాధ్యతే. అయినా పవన్ కళ్యాణ్ చెప్పాక రామ్ చరణ్ చేయకుండా ఉంటాడా.. 

More Related Stories