English   

నలుగురు భామలూ నార్మల్ గానే ఉన్నారు

Queen-remake
2018-10-21 16:11:31

కొన్ని సినిమాలు టచ్ చేయకపోతేనే బెటర్. ముఖ్యంగా వాటిని రీమేక్ చేయడం. అవి ఒన్ టైమ్ వండర్స్ గానే ఉండాలి. కాదని రీమేక్ చేసినా అవి అలాగే ఉంటాయి. అందుకు ఉదాహరణగా ఎన్నో సినిమాలు చూశాం. ఇప్పుడు 2014లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ ‘క్వీన్’ సినిమా రీమేక్ సౌత్ లో చూడబోతున్నాం. చూడబోతున్నాం అని ఎందుకంటున్నామంటే.. ఈ రీమేక్ కు సంబంధించి నాలుగు భాషల ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు. బట్ ఒక్కటీ ఆకట్టుకునేలా లేదు. ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తాయన్న నమ్మకమూ ఇవ్వలేదు. యస్.. నిజానికి క్వీన్ సినిమా కంగనా రనౌత్ అనే సాధారణ నటిని బాలీవుడ్ క్వీన్ గా మార్చింది. ఆ సినిమా కెపాసిటీ అది. అలాంటి మూవీని రీమేక్ చేయడం అంటే స్క్రిప్ట్ మీద సాములాంటిది. ఎందుకంటే నేటివిటీ ఇంపార్టెంట్ కదా. పైగా ఒకేసారి నాలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ నాలుగు భాషలకు చెందిన క్వీన్స్ ఫస్ట్ లుక్స్ విడుదలయ్యాయి. బట్ ఆకట్టుకున్నాయా అంటే.. చెప్పడం పూర్తిగా కష్టం. క్వీన్ తెలుగు రీమేక్ లో తమన్నా నటిస్తోంది. ఈ మూవీకి తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే టైటిల్ పెట్టారు. మొదట్లో నీలకంఠ డైరెక్ట్ చేశారు. కానీ మధ్యలో ఆయనకు మూవీ టీమ్ కు పడలేదు. దీంతో కొన్నాళ్లు ఆగింది కూడా. ఫైనల్ గా ‘అఁ’ మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ సీన్ లోకి వచ్చి పూర్తి చేశాడు. కానీ ఆశ్చర్యంగా ఈ మూవీకి టైటిల్స్ లో దర్శకుడి స్థానం ఖాళీగా ఉంది. అంటే నీలకంఠ కానీ, ప్రశాంత్ వర్మ పేరు కానీ లేదు. ఫైనల్ గా థియేటర్ లో ఎవరి పేరు వేస్తారో చూడాలి. 

ఇక తమిళ్ లో ఈ మూవీకి ‘పారిస్ పారిస్’ అనే టైటిల్ పెట్టారు. కన్నడ నటుడు రమేష్ అరవింద్ ఈ తమిళ్ వెర్షన్ డైరెక్టర్. తమిళ్ రాణిగా కాజల్ నటిస్తోంది. తన లుక్ కూడా ఏమంత ఆకట్టుకునేలా లేదు. కన్నడలో క్వీన్ కు ‘బటర్ ఫ్లై’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. కన్నడ వెర్షన్ కూడా రమేష్ అరవిందే డైరెక్ట్ చేస్తుండటం విశేషం. కన్నడ పరిశ్రమలో టాలెంటెడ్ బ్యూటీ అనిపించుకున్న పారుల్ యాదవ్ టైటిల్ రోల్ చేస్తోంది. ఇక మళయాలంలో మంజిమా మోహన్ టైటిల్ రోల్ చేస్తోంది. ‘జామ్ జామ్’ అనే టైటిల్ తో రీమేక్ అవుతోన్న ఈ మూవీకి మళ్లీ నీలకంఠ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. అంటే ముందుగా అనుకున్న దర్శకులు తెలుగులో తప్ప ఎక్కడా మారలేదన్నమాట. మొత్తంగా ఈ నలుగురులో కాస్త పారుల్ యాదవ్ మాత్రమే క్వీన్ ఒరిజినల్ లుక్ కు దగ్గరగా ఉంది. తమన్న మరీ దారుణంగా ఓవర్ మేకోవర్ తో ఓల్డ్ గా కనిపిస్తోంటే.. కాజల్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇక ఛబ్బీ బ్యూటీ మంజిమా కూడా మామూలుగానే కనిపిస్తోంది. ఏదేమైనా ఓ సూపర్ హిట్ మ్యాజిక్ ను రిపీట్ చేయడం.. కష్టం. అలాంటిది ఒకేసారి నాలుగు భాషల్లో ఆ మ్యాజిక్ రిపీట్ అవడం దాదాపు అసాధ్యం. మరి వీళ్లు దీన్ని సుసాధ్యం చేస్తారని అనుకుందామా..?

More Related Stories