English   

దీపికా, రణ్ వీర్ సడెన్ గా షాక్ 

Deepika-Ranveer
2018-10-22 02:12:17

చాలాకాలంగా ప్రమలో మునిగితేలుతున్న బాలీవుడ్ సెలెబ్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పడుకోణ్ లు సడెన్ గా షాక్ ఇచ్చారు. గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటోన్న ఈ జంట వారి పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా దాటవేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా కూడా తమ పెళ్లి మీరే డిసైడ్ చేయండి అంటూ మీడియాపై సెటైర్స్ వేసి కొత్త డౌట్స్ క్రియేట్ చేసిన వీళ్లు నిజంగానే మీడియాకే కాదు.. ఆడియన్స్ కు కూడా షాక్ ఇచ్చే డెసిషన్ తీసుకున్నారు. మరి ఆ షాకింగ్ డెసిషన్ ఏంటో తెలుసా.. ఇద్దరూ పెళ్లి చేసకోబున్నారు. అంతే కాదు.. డేట్ తో సహా అనౌన్స్ చేశారు. యస్.. ఈ క్రేజీ కపుల్ మూడుముళ్లకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ మేరకు ఇద్దరూ తమ ‘మ్యారేజ్ నోట్’ ను రిలీజ్ చేశారు. వారు విడుదల చేసిన లేఖలో ‘‘ మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో మేం ఇద్దరం ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం మీకు తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా పెళ్లి వచ్చే నవంబర్ 14, 15 తేదీల్లో జరగబోతోంది. ఇన్నేళ్లుగా మీరు మాపై చూపించిన ప్రేమకు థ్యాంక్స్. మా ఈ ప్రయాణంలో మీరు చూపిన ప్రేమ, ఆదరణ, స్నేహం ఎప్పటికీ మరవలేము’’ అంటూ చెప్పారు. మొత్తంగా అసలు అవుతుందా లేక ఇతర బాలీవుడ్ సెలెబ్స్ లాగే వీళ్లూ కొన్నాళ్ల తర్వాత మేం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటారా అనుకున్నవాళ్లకు సడెన్ గా షాక్ ఇచ్చినంత పనిచేసిందీ జంట. 

More Related Stories