English   

రామ్ సత్తా ఓకే కానీ మరి దిల్ రాజు?

Hello Guru Prema Kosame Box Office Collections
2018-10-22 13:46:21

కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న యంగ్ హీరో రామ్ కు చాలా రోజుల తర్వాత హలోగురూ ప్రేమకోసమేతో రిలీఫ్ వచ్చింది. అలాగని ఇదేమీ సూపర్ మూవీ అనలేం. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం సూపర్ పర్ఫార్మ్ చేసింది. ఇది రామ్ కు ఓకే కానీ నిర్మాతకు కాదు అంటోంది ట్రేడ్. అయినా సరే.. ఉన్న పరిస్థితుల్లో హలోగురూ ప్రేమకోసమే మంచి కలెక్షన్సే రాబడుతోంది. అటు అనుపమ పరమేశ్వరన్ కు కూడా ఈ మూవీ చాలా వరకూ మేలే చేసింది. సినిమాలతో తన ఇంపాక్ట్ పెద్దగా లేకపోయినా.. హిట్ సినిమాలో పార్ట్ అయిందనే భావన తనకు చాలా రిలీఫ్ ఇచ్చే అంశం. అలాగే ఐరన్ లెగ్ అన్న ట్యాగ్ ను కూడా తొలగించే చాన్సుంది. మొత్తంగా ఈ మూవీ మూడు రోజుల్లోనే 10 కోట్ల షేర్ సాధించి సత్తా చాటింది. ఒక రకంగా ఈ కలెక్షన్స్ కూడా ట్రేడ్ ను ఆశ్చర్యపరిచాయి. పండగ మూడ్ తో పాటు లవ్ స్టోరీ కావడం.. సినిమా మరీ బోరింగ్ గా లేకపోవడంతో రామ్ కు కలిసొచ్చింది. మరి హలోగురూ ప్రేమకోసమే మూడు రోజుల కలెక్షన్స్ షేర్స్ రూపంలో ఓ సారి చూద్దాం.

నైజాం     : 4 కోట్ల 50 లక్షలు

సీడెడ్     : 1 కోటి 50 లక్షలు

గుంటూర్  : 0. 86 లక్షలు

కృష్ణా     : 0. 69 లక్షలు

ఈస్ట్     : 0. 68 లక్షలు

వెస్ట్     : 0. 49 లక్షలు

నెల్లూర్     : 0.32 లక్షలు

యూఏ     : 1 కోటి 44 లక్షలు

 

ఏపి/టిఎస్ : 10.48 కోట్లు

ఇక సినిమాను ఆంధ్రతో పాటు ఇండియా వైడ్ గా 17.65 కోట్లకు అమ్మేశారు. అంటే ఈ కలెక్షన్స్ రామ్ కు భారీ ఊరట అయితే నిర్మాతకు మాత్రం ఇబ్బందికరం. బట్ ఇప్పుడు సిట్యుయేషన్ చూస్తే మిగతా ఏడు కోట్లు కలెక్ట్ చేయడం అంత సులభం కాదు. ఒకవేళ సాధిస్తే మాత్రం రికార్డ్ గానే చెప్పాలి.

More Related Stories