English   

సింగర్ సునీత కూతురు అమ్మను ఫాలో అవుతుంది

Singer Sunitha Daughter Shreya Introducing in Savyasachi
2018-10-22 14:54:53

తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ సునీతకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఆమె గొంతు ఎంత అందంగా ఉంటుందో తనూ అంతే. అలాగే ఆమె పాడితే ఎంత రెస్పెక్ట్ వస్తుందో.. తనకూ అంతే ఉంటుంది. పాటలతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ తిరుగులేని గుర్తింపు తెచ్చుకొంది. ఇప్పుడు సునీత కూతురు కూడా తెలుగు పరిశ్రమకు పరిచయం కాబోతోంది. అయితే నటిగా కాదు.. గాయనిగానే. అవును.. నటుల కొడుకులు నటులు.. గాయకుల వారసులు గాయకులు అవడం చాలాకాలంగా చూస్తున్నాం. కానీ ఓ ఫిమేల్ సింగర్ కు వారుసురాలు తెలుగులో రావడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘనతను అరంగేట్రంతోనే దక్కించుకుంది సునీత కూతురు.

సునీత కూతురు పేరు శ్రేయా గోపరాజు. నాగచైతన్య  హీరోగా నటిస్తోన్న సవ్యసాచి సినిమాతో శ్రేయా సింగర్ గా టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. ఈ విషయాన్ని సునీత స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం విశేషం. తొలి పాట రికార్డింగ్ సందర్భంగా శ్రేయా చాలా భయపడిందట. కానీ ఈ సినిమా సంగీత దర్శకుడు కీరవాణి గారు చాలా ధైర్యం చెప్పి తనతో పాట రికార్డింగ్ చేయించారు. అప్పుడు నాకు ఆయనతో ఫస్ట్ టైమ్ పాట రికార్డింగ్ చేసిన రోజులు గుర్తొచ్చాయి అంటూ సునీత ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక త్వరలోనే సవ్యసాచి సినిమా కోసం కీరవాణి సంగీత సారథ్యంలో శ్రేయా పాడిన పాట విడుదల చేస్తారట. మరి సునీత లాగే శ్రేయ గాత్రం కూడా అంతే బావుంటుందా అనేది చూడాలి.

More Related Stories