English   

బాలయ్య వచ్చాడని ఎన్టీఆర్ చేస్తాడా?

Reason Behind Balakrishna Chief Guest for Aravainda Sametha Success Event
2018-10-22 17:20:15

అరవింద సమేత వీరరాఘవ సినిమా సక్సెస్ మీట్ కు బాలయ్య చీఫ్ గెస్ట్ గా వచ్చాడు కదా.. మరి ఎన్టీఆర్ ఏం చేయాలి.. అంటే 2019లో పార్టీకి మద్ధతు ఇవ్వాలి. వీలైతే ప్రచారం చేయాలి. ఒక రకంగా ఇదంతా ‘క్విడ్ ప్రో కో’లాంటిది అనేవారూ ఉన్నారు. కానీ అన్నీ ఇప్పుడే అనుకుంటే తొందరపాటవుతుంది. కానీ వేదికపై ఎలా చూసుకున్నా.. బాలయ్యా, ఎన్టీఆర్ ల మధ్య ఏదో తెలియని గ్యాప్ అయితే కనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ అంత కలివిడిగా ఎన్టీఆర్ లేడు.. కళ్యాణ్ రామ్ తో ఉన్నట్టుగా బాలయ్య ఎన్టీఆర్ తో లేడు. అటు మాటల్లో కూడా తారక్ గురించి పెద్దగా మాట్లాడింది లేదు. అందుకే అప్పుడే వీరిమధ్య గొడవలు పోయినట్టే అని చెప్పలేం అంటున్నారు. వేదికపై బాలకృష్ణను ఎన్టీఆర్ ను చూసిన అందరికి అర్ధం అవుతుంది.. మొత్తంగా ఈ కలయిక వెనక కళ్యాణ్ రామ్ మంతనాలు ఉన్నాయని ముందు నుంచీ వినిపిస్తున్నదే.

Balakrishna Kalyana Ram NTR Aravinda Sametha

కళ్యాణ్ పిలవడం వల్లే బాలయ్య ఈ ఫంక్షన్ కు వచ్చాడని ఓపెన్ గానే చెప్పుకుంటున్నారు. అంటే బాలయ్య, తారక్ కోసం రాలేదనుకోవచ్చు. కానీ నందమూరి కుటుంబంలో గుంభనాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అందుకే ఇది పూర్తిగా నిజం అనుకోనక్కర్లేదు కూడా. ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ సినిమాలో హరికృష్ణ పాత్రలో నటిస్తున్నాడు.  ఆ టైమ్ లో కళ్యాణ్ అడిగి ఉండొచ్చు.

Balakrishna Kalyana Ram NTR Aravinda Sametha

మరోవైపు ఇదంతా చంద్రబాబు స్కెచ్ అనేవాళ్ళు లేకపోలేదు. చంద్రబాబు చెబితేనే బాలయ్య వచ్చాడనీ... తద్వారా బుడ్డోడిని వచ్చే ఎన్నికల్లో తాను నేరుగా పిలవకుండా బాలయ్యతో అడిగించవచ్చనే స్కెచ్ వేశాడనీ అంటున్నారు. చంద్రబాబు చాతుర్యం తెలిసిన ఎవరైనా సరే ఇది నిజమే అని నమ్ముతారు. చంద్రబాబు పిలిస్తే ఎన్టీఆర్ వస్తాడన్న గ్యారెంటీ అయితే లేదు. అందుకే బాలయ్యతో చెప్పిస్తే.. ఖచ్చితంగా వస్తాడు. రాకపోతే వారి కుటుంబ సమస్యగా ఆగిపోతుంది. అప్పుడు మళ్లీ వీరి కుటుంబం మధ్యే ఇబ్బందులు మొదలవుతాయి. ఏదేమైనా గొప్పవారి కుటుంబాల్లో కొన్ని విషయాలు పైకి కనిపించేవి కావు. మరి ఈ కలయిక ఎన్నాళ్లుంటుంది.. ఎవరి ఫంక్షన్లకు ఎవరు వెళతారు అనేది అతి త్వరలోనే ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్ లోనే తెలిసిపోతుంది. అప్పటి వరకూ ఈ కలయిక వెనక మర్మం కంటే కలిసిన ఆనందం ఎక్కువగా కనిపిస్తుంది.

Balakrishna Kalyana Ram NTR Aravinda Sametha

More Related Stories