English   

పెద్దల్లుడితో ‘‘ఎన్టీఆర్’’

Daggubati Venkateshwar rao First Look Released From Balakrishna’s NTR Biopic
2018-10-22 22:20:40

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కిస్తోన్న నందమూరి తారకరామారావు బయోపిక్ రోజుకో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. మొదట్లో ఈ పాత్రకు బాలయ్య సరిపోడు అన్నవాళ్లే ఇప్పుడు బాలయ్యను మించిన ఆప్షన్ లేదు అనుకునేలా చేస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్ లో సరికొత్త మార్పులు, చేర్పులు జరుపుకున్న ఈ మూవీ ఏకంగా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఆ రెండు భాగాలూ కేవలం రెండు వారాల వ్యవధిలో విడుదల చేస్తూ మరో సంచలనం సృష్టించబోతోన్న ఈ టీమ్ నుంచి ఎన్టీఆర్ పెద్ద అల్లుడి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

Daggubati Venkateshwar rao First Look Released From Balakrishna’s NTR Biopic

‘‘ఎన్టీఆర్ మహానాయకుడు’’ పార్ట్ లో కనిపించబోతోన్న ఆ పాత్ర ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇప్పటి వరకూ చిన్నా చితకా పాత్రలు వేస్తోన్న డాక్టర్ అండ్ యాక్టర్ భరత్ రెడ్డిని ఈ పాత్రకు తీసుకున్నారు. ఎప్పట్లానే క్రిష్ మంచి మేకోవర్ తో ఆశ్చర్యపరిచాడు. భరత్ రెడ్డి ఆహార్యం కూడా వెంకటేశ్వరరావుకు దగ్గరగా ఉండటం విశేషం. అయితే ఈపాత్రకు  సినిమాలో పెద్దగా స్కోప్ ఉంటుందనుకోలేం. అందుకే భరత్ ను తీసుకున్నారేమో అనేవాళ్లూ లేకపోలేదు. ఏదేమైనా ఈ లుక్ ఇంత సడెన్ గా రావడానికి కారణం దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా నటిస్తోన్న భరత్ రెడ్డి బర్త్ డే కావడమే.

More Related Stories