English   

రూట్ మారుస్తోన్న శ్రుతి హాసన్

Shruti Haasan Planning to do Television Hosting in Tamil
2018-10-22 23:09:36

కొన్నాళ్ల క్రితం తెలుగు, తమిళ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా ఉంది శ్రుతి హాసన్. స్టార్ హీరోలందరూ అమ్మడి వెంటపడ్డారు. కానీ పెద్దగా ఫ్లాపులు కూడా లేకుండా సడెన్ గా వెండితెరకు గ్యాప్ ఇచ్చింది. దీంతో చాలామంది షాక్ అయ్యారు. ఇంత సడెన్ గా ఎందుకంత గ్యాప్ తీసుకుందని ఫీలయ్యారు. బట్.. తండ్రిలాగే ఎవరి ఆలోచనకీ అందకుండా మెయింటైన్ చేస్తోంది.. కొన్నాళ్లుగా ఓ విదేశీయుడుతో డేటింగ్ కూడా చేస్తోన్న శ్రుతి హాసన్ ను.. మళ్లీ సినిమాల్లో ఎప్పుడు నటిస్తారు అనడిగితే.. నా ఇష్టం.. మీకెందుకు అంటుంది. అందువల్ల తనను అడగడం కూడా మానేశారు మనాళ్లు. గత కొన్ని రోజులుగా మాగ్జిమం సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంటోన్న శ్రుతి హాసన్ లేటెస్ట్ గా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.

Shruti Haasan Planning to do Television Hosting in Tamil

శ్రుతి హాసన్ కూడా తండ్రి బాటలోనే వెళుతోంది. కానీ చాలా ఎర్లీగా. అదేంటో తెలుసా.. తను కూడా ఓ టివి షోను హోస్ట్ చేయబోతోంది. యస్.. కమల్ హాసన్ బిగ్ బాస్ కు హోస్ట్ అయినట్టుగా తను కూడా ఓ టివి షోను హోస్ట్ చేయబోతోంది. ఆ తమిళ్ ఛానల్ లో ప్రసారమయ్యే ఆ ప్రోగ్రామ్ పేరు ‘‘హలో సాగో’’ అట. ఈ టైటిల్ కు మించి ఈ షో గురించి పెద్దగా వివరాల్లేవ్. కానీ త్వరలోనే ఆన్ ఎయిర్ లోకి వస్తుందని చెబుతున్నారు. ఏదేమైనా హీరోయిన్ గా ఓ రేంజ్ ఆఫర్స్ ను వదులుకుని.. తనకు నచ్చినట్టుగా లైఫ్ ను లీడ్ చేస్తూ.. వెళుతోన్న శ్రుతి హాసన్ ఇలా టివి షోకు హోస్ట్ గా వెళుతూ ఓ చిన్నపాటి షాకే ఇస్తోందని చెప్పాలి.

More Related Stories