English   

రామ్ చరణ్ కోసం వేచిచూస్తోన్న అభిమానులు

Ram Charan Boyapati Combination Movie Release date Dilemma
2018-10-23 09:29:47

రావడం లేట్ అవుతుందేమో కానీ.. రావడం మాత్రం పక్కా.. ఇలాంటి డైలాగ్స్ సినిమాల్లో వినడానికి బావుంటాయి. కానీ రియాలిటీలో కొంచెం ఇబ్బంది పెడతాయి. ఇదే సినిమాల విషయంలో అయితే ఫ్యాన్స్ నుంచి వచ్చే ఇబ్బందులు వేరేలా ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్, బోయపాటి సినిమా విషయంలోనూ ఇది అలాగే మారింది. రావడం పక్కానే.. కానీ ఎప్పుడు అన్నదే ఇబ్బంది.అందుకే  రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ విషయంలో కూడా ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్.. వాళ్లు మేం క్లారిటీగానే ఉన్నాం అంటున్నారనుకోండి. ఇంతకీ మేటర్ ఏంటంటే రామ్ చరణ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందీ అనేది ఇంకా క్లారిటీ రావట్లేదు.

రామ్ చరణ్ బోయపాటి కాంబోలో వస్తోన్న ఈ మూవీని నిజానికి ఈ యేడాదే విడుదల చేయాలనుకున్నారు. కానీ సంక్రాంతి బెటర్ అనుకున్నారు.బట్.. బోయపాటి చేస్తోన్న పనికి ఈ మూవీ సంక్రాంతికి కూడా వచ్చేలా లేదు అనే రూమర్స్ మొదలయ్యాయి.  నిజానికి వీళ్లు సంక్రాంతి సందర్భంగా.. జనవరి 11న సినిమా విడుదల చేయాలనుకున్నారు. కానీ బోయపాటి అత్యుత్సాహం, ఓవర్ బడ్జెట్ వల్ల ఆ టైమ్ కు రావడం డౌటే అంటున్నారు. మొత్తంగా ఈ రూమర్స్ అన్నీ.. నిర్మాత చెవిన పడ్డట్టున్నాయి. అందుకే హడావిడీగా.. మేం.. జనవరి 11నే వస్తున్నాం.. అంటూ ఓ క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇది అఫీషియల్ కాదు.అందువల్ల... ఇప్పటికే దసరాకు ఏదో ఇస్తారని ఆశపడ్డ అభిమానుల్ని నిరాశపరిచాడు బోయపాటి.. తర్వాతైనా కనీసం ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ వదులుతారు అనుకున్నారు.బట్.. అవేవీలేకపోవడంతో.. ఇప్పుడు ‘‘జనవరి 11’’ కూడా ఎవరూ నమ్మడం లేదు. నమ్మాలంటే సింపుల్ గా వీళ్లే అఫీషియల్ గా ఓ అనౌన్స్ మెంట్ చేయాలి. అప్పుడు కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వస్తుంది.

More Related Stories