English   

మాజీ హీరోతో నాగ చైతన్య గొడవ షురూ

Savyasachi-Trailer
2018-10-23 10:29:20

అక్కినేని నాగచైతన్య.. ప్రేమమ్ తో టచ్ లోకి వచ్చినట్టే వచ్చాడు. కానీ మళ్లీ యావరేజ్ సినిమాలే చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన శైలజారెడ్డి అల్లుడు కూడా అనుకున్నంతగా ఆడలేదు. ఈ నేపథ్యంలో తనకు ప్రేమమ్ తో టర్నింగ్ పాయింట్ వంటి హిట్  ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో వస్తోన్న ‘సవ్యసాచి’పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక నిన్నటి హ్యాండ్సమ్ హీరో మాధవన్ విలన్ గా నటిస్తోన్న ఈ మూవీలో అతని పాత్రే కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయంటున్నారు. విలన్ అంటే రెగ్యులర్ గా కాకుండా మాధవన్ క్యారెక్టరైజేషన్ చాలా బావుంటుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే భూమిక కూడా చైతూకు సిస్టర్ గా నటిస్తోంది. మొత్తంగా క్రేజీ ప్రాజెక్ట్ గా మొదలైన ఈ సినిమా మధ్యలో గ్యాప్ రావడంతో కాస్త క్రేజ్ తగ్గింది. శైలజారెడ్డిపై చైతూ చాలా ఆశలు పెట్టుకుని ఈ మూవీని హోల్డ్ లో పెట్టాడు. కానీ ఆ మూవీ రిజల్ట్ తేడా కొట్టేసరికి ఇక దీనిపైనే పూర్తిగా దృష్టిపెట్టాడు.. ఇక కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ నెల 24న సాయంత్రం 3 గంటలకు సవ్యసాచి ట్రైలర్ విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ హీరో పాత్రను ఎలివేట్ చేసినా.. కంటెంట్ గురించి ఏమీ చెప్పలేదు. మరి ఈ సారి కంటెంట్ తో పాటు ఇతర పాత్రల ప్రాధాన్యం కూడా తెలిసేలా ఈ ట్రైలర్ ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా ఈ మూవీ చైతూకు చాలా కీలకం. అటు చందు మొండేటి కూడా మాగ్జిమం గ్యారెంటీ ఉన్న కథకుడు.. మంచి దర్శకుడు కూడా కావడంతో ఖచ్చితంగా ఓ వైవిధ్యమైని సినమాగా నిలిచే అవకాశాలున్నాయి. ఇక సవ్యసాచి నవంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

More Related Stories