English   

సాహో.. ప్రభాస్ కొత్త షేడ్ చూశారా..?

Prabhas
2018-10-23 10:46:06

రెబల్ స్టార్ ప్రభాస్ సాహోలో ఎలా ఉంటాడు.. అంటే ఇప్పటి వరకూ కొన్ని లుక్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చిన లుక్ పూర్తిగా భిన్నంగా ఉంది.  ఈ మంగళవారం ప్రభాస్ బర్త్ డే.. ఆ సందర్భంగా ‘‘షేడ్స్ ఆఫ్ సాహో’’ పేరుతో ఓ పోస్టర్ విడుదల చేశారు. ఎదురుగా లైటింగ్ తో, వెనక నుంచి కనిపిపిస్తున్న ప్రభాస్ కంప్లీట్ షేడ్ లో రఫ్ గా ఉన్నాడు.. సాహో షేడ్స్ లో ఇదీ ఒకటన్నమాట. అంటే ఇంకా కొన్ని షేడ్స్ ఉంటాయనే కదా అర్థం. అంతే కాదు.. ఆ షేడ్స్ ను బట్టి ఆయన క్యారక్టర్ కూడా ఉంటుందని ఈజీగా ఊహించేయొచ్చు. నిజానికి తన బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ రెడీ చేశానని వారం క్రితమే చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. సరిగ్గా ‘ఉదయం 11 గంటలకు తను చెప్పిన సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు’. ఇక ఉదయం ఇంకా కొన్ని ఫోటోస్ వస్తాయా.. లేక టీజర్ వస్తుందా అనేది ఇంకా క్లియర్ గా తెలియదు కానీ.. మొత్తంగా ఈ లుక్ తో కాస్త హీటు పెంచాడు ప్రభాస్. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు. దాదాపు 200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఒకే సారి తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ విడుదల చేయబోతున్నారు. అందుకే ఆయా భాషల నటీనటుల్నే ఎక్కువగా తీసుకున్నారు. ముఖ్యంగా ఈ మూవీతో బాలీవుడ్ లో పాగా వేయాలని.. లేదంటే అక్కడ స్ట్రాంగ్ మార్కెట్ ను సెట్ చేసుకోవాలనేది ప్రభాస్ ఆలోచన. అందుకు తగ్గట్టుగానే ఇందులో ఎక్కువమంది బాలీవుడ్ ఆర్టిస్టులున్నారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ మన బాహుబలితో రొమాన్స్ చేస్తుండగా జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్ విలన్స్ గా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో ఎవలిన్ శర్మ, మందిరాబేడీ, చుంకీపాండే వంటి భామలూ ఉన్నారు. మొత్తంగా వచ్చే యేడాది వేసవిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

More Related Stories