English   

అరవింద సమేతుడు అది కూడా సాధించాడా..?

Aravinda-Sametha
2018-10-23 14:20:09

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది. ఇప్పటికే వీరి కెరీర్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ లేటెస్ట్ గా మరోసారి ఈ ఇద్దరి కెరీర్ కే బెస్ట్ అయినా బెంచ్ మార్క్ ను చేరుకుంది. యస్.. తొలివారంలోనే వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన అరవిందుడు లేటెస్ట్ గా 150కోట్లు సాధించాడని అనౌన్స్ చేశారు. ఈ మేరకు 150కోట్లతో కొత్త పోస్టర్స్ కూడా వచ్చేశాయి. ఈ విషయాన్ని హారిక హాసిని బ్యానర్ నుంచే అఫీషియల్ గా రావడంతో ఇక ఎన్టీవోడు కలెక్షన్స్ లో నయా బెంచ్ మార్క్ ను చేరుకున్నాడని చెప్పొచ్చు. ఇక ఆదివారం జరిగిన సక్సెస్ మీట్ కు బాలయ్య చీఫ్ గెస్ట్ గా రావడంతో మరింత జోష్ తెచ్చుకున్న అరవిందుడు ఇంకాస్త ఊపు పెంచాడంటున్నారు.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో నుంచి ఊహించని కథతో వచ్చిన ఈ మూవీతో ఎన్టీఆర్ కెరీర్ లోనే మరో బెస్ట్ పర్ఫార్మన్స్ ఇచ్చాడనే టాక్ తెచ్చుకున్నాడు. హీరోయిన్ పూజా హెగ్డే కూడా అద్భుతంగా ఆకట్టుకోవడంతో అమ్మడు లక్కీ బ్యూటీగా మారినట్టే అనుకోవచ్చు. ఇక తమన్ సంగీతానికి ప్రత్యేక స్థానం కూడా దక్కింది. ఈ మూవీతో తమన్ విమర్శకుల నోళ్లు కూడా మూయించాడు. మొత్తంగా ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ మూవీతో ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేశాడు. అటు త్రివిక్రమ్ కు కూడా ఇవే హయ్యొస్ట్ కలెక్షన్స్ కావడం విశేషం. మొత్తంగా అరవిందుడు తెలుగు స్టేట్స్ లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. 

More Related Stories