English   

చిన్న షేడ్ తోనే సాహో అనిపించారుగా

Prabhas
2018-10-23 14:59:02

లేట్ అయినా లేటెస్ట్ గా అనే మాటకు అసలైన అర్థంలా ఉంది.. ఇన్నాళ్ల వెయిటింగ్ కు అభిమానులు కాలరెగరేసుకునేలా ఉంది.. బాహుబలితో ఓ లెవెల్ కు వెళ్లిన తను తన స్టాండర్డ్స్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళుతున్నాడు అని ఖచ్చితంగా చెప్పుకునేలా ఉంది. ఓవరాల్ గా వాట్టే విజువల్ అనిపించింది. దటీజ్ ప్రభాస్ అనేలా ఉంది. యస్.. ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సాహో’ షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ -1 అంటూ వచ్చిన వీడియో ఇప్పుడు డిజిటల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్నాళ్లూ ఎవరికి వారు ఎలా ఉంటుందా అని వేసుకున్న ఊహలు సైతం ఆశ్చర్యపోయేలా ఓ రేంజ్ లో ఉందీ విజువల్. ఇంకా చెబితే.. ఓ టామ్ క్రూయిజ్ సినిమా చూడబోతున్నామా లేక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీని సింగిల్ హీరోతో చూడబోతున్నామా అనే అనుభూతినిచ్చేలా చేసిన ఈ వీడియోతో ప్రభాస్ ఇన్నాళ్లూ తానెందుకు వెయిట్ చేశాడో.. అభిమానులను ఎందుకు వెయిట్ చేయించాడో చెప్పకనే చెప్పాడు. 

ఒకే సినిమా వయసున్న సుజిత్ ఇలాంటి సినిమా తీస్తున్నాడంటే ఆశ్చర్యమే. ఊహాశక్తికి అనుభవంతో పనిలేదని నిరూపించబోతున్నట్టుగా ఉన్నాడు సుజిత్. నిజంగా రాజమౌళి రేంజ్ డైరెక్టర్ తీస్తున్నాడా అన్నట్టుగా ఉందీ మూవీ చాప్టర్ -1. ఇక ఈ మూవీ కోసం పనిచేస్తోన్న టెక్నికల్ టీమ్ కూడా ఓ రేంజ్ వాళ్లే. సినిమాటోగ్రాఫర్ మధీతో పాటు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్, ప్రొడక్షన్ డిజైనర్ గా సాబూ సిరిల్.. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా నేషనల్ అవార్డ్ విన్నర్ కమల్ కన్నన్ ఉన్నారు. 

అత్యంత కాస్ట్ లీ మేకింగ్ తో వచ్చిన వీళ్లు ఫినిషింగ్ లోనూ అత్యంత స్టైలిష్ గా ఉన్న ప్రభాస్ ను ఎలివేట్ చేసిన విధానం కూడా అదిరిపోయింది. ఇక హీరోయిన్ శ్రద్ధాకపూర్ క్యారెక్టర్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉండబోతోందనే విషయం తెలుస్తోంది. హీరోయిన్ అండ్ హీరో తప్ప మిగతా ఆర్టిస్టులు ఎలివేట్ అయ్యే అవకాశం రాలేదు. అయినా సరే ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారా.. అనుకున్నవారికి ఈ వీడియోతో ఓ క్లారిటీ వచ్చే ఉంటుంది.. ఏదేమైనా చిన్న షేడ్ తోనే సాహో అనిపించేశారు. 

More Related Stories