English   

బోల్డ్, కల్ట్ సరే.. బజ్ ఏది బాస్

Veera-Bhoga-Vasantha-Rayalu
2018-10-23 15:23:52

కొన్ని అంతే బాస్.. అన్నీ ఉంటాయి.. బజ్ తప్ప.. క్రేజ్ ఉంటుంది. కానీ అది కొన్ని వర్గాలకే పరిమితం అవుతుంది. భలే ఉందే అనిపిస్తుంది. ఆ మాటను ఆడియన్స్ కు బాగా అర్థమయ్యేలా చెప్పలేరు. దీంతో ఏదో అవుతాయి అనుకున్న సినిమాలెన్నో ఇంకేదో అయిన సందర్భాలెన్నో చూశాం. ఇప్పుడు ‘వీరభోగవసంతరాయలు’ సినిమా కూడా ఈ జాబితాలో చేరుతుందా అనిపిస్తోంది. లేకపోతే.. సినిమా విడుదలకు నాలుగు రోజులు కూడా లేదు. అయినాఆ సినిమా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆడియన్స్ అంటే బిజీగా ఉంటారనుకోవచ్చు. మరి అటెన్షన్ ను డ్రా చేయాల్సిన అవసరం సినిమా యూనిట్ కు ఉంటుంది కదా.. కానీ వాళ్లు కూడా ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకే విడుదలకు కేవలం నాలుగు రోజులే ఉన్న ఒక ప్రమోషన్ కానీ.. రిలీజ్ కు ముందే ఉండే హడావిడీ కానీ కనిపించడం లేదు. అంటే ఈ కల్ట్ మూవీ రిజల్ట్ వారికి ముందే అర్థమైందా లేక.. ప్రేక్షకులకు పరీక్షలు పెడుతున్నారా.. 

నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు, శ్రీయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. కానీ కామన్ ఆడియన్ కు అది అర్థం కాలేదు. పోనీ ఓ జానర్ సినిమా కావొచ్చు.. వారినే ఆకట్టుకుంటుందేమో అంటే కనీసం వారి అటెన్షన్ ను కూడా తీసుకోవడం లేదీ సినిమా. అటు రోహిత్ కానీ, శ్రీ విష్ణు కానీ మూవీ గురించి ఎక్కడా పెద్దగా మాట్లాడ్డం లేదు. దీంతో ఈ సినిమా ‘అస్సాం’ అనే భావన ఆడియన్స్ లో కలగకుండా ఉంటుందా. పైగా ఇప్పటికే వెల్ నోటెడ్ అయిన సుధీర్ బాబుకు వేరేవారితో చెప్పించిన డబ్బింగ్ ట్రైలర్ లో వింతగా ఉంది. మొత్తంగా వీరభోగ వసంతరాయలు బోల్డ్ కావొచ్చు.. కల్ట్ కావొచ్చు.. కానీ బజ్ లేకపోతే ఆ రెండూ ఆడియన్స్ కు చేరవు..  

నిజానికి వీళ్లు సడెన్ గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినా.. అవి అంత త్వరగా ప్రేక్షకులను చేరతాయనుకోలేం.. ఎందుకంటే ఇప్పుడంతా ఎన్నికల హడావిడీ ఉంది. అందువల్ల ఇలాంటి మీడియం రేంజ్ హీరోల ఇంటర్వ్యూస్ కు ఏ మీడియా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు. ఇక మిగిలింది.. డిజిటల్ మీడియా.. కానీ డిజిటల్ మీడియాను ఫాలో అయ్యి సినిమాకు వెళ్లే ఆడియన్స్ ఎంతమంది..? సో.. వీరభోగవసంతరాయలు మొత్తంగా ఏదో తేడా కొట్టడం లేదూ..?

More Related Stories