English   

యాక్షన్ అయిపోయింది.. ఇక లవ్ స్టోరీ అంట

Bellamkonda-Sreenivas
2018-10-23 16:25:52

ఏదైనా ఫిజిక్ కు తగ్గట్టుగా చేయాలంటారు. తద్వారా ఫిజిక్ తో పాటు ఇమేజ్ ను పెంచుకుంటే ఆ ఇమేజ్ కు అనుగుణంగా వచ్చే కథల్లో మనం ఇమిడిపోతాం. అంతేకానీ.. లేని ఇమేజ్ ను ఆపాదించుకుని ఓ స్టార్ హీరో రేంజ్ లో యాక్షన్ సినిమాలు చేసేసి ఓవర్ నైట్ మాస్ హీరో అయిపోవాలంటే మాత్రం పరిస్థితి జయజానకి నాయకుడిలా మారుతుంది. అప్పుడైనా నిజం తెలుసుకోకపోతే కెరీర్ ప్రమాదంలో పడుతుంది. కానీ ఆ ప్రమాదం నుంచి వెంటనే తేరుకున్నాడు మన అల్లుడు శీను.. అలియాస్ బెల్లంకొండ శ్రీనివాస్. కుర్రాడు మొదట్లో మాస్ హీరో అయిపోవాలని తెగ ప్రయత్నించాడు. దీనికోసం షార్ట్ కట్ లా ఉంటుంది ఆల్రెడీ టాప్ ప్లేస్ లో ఉన్న హీరోయిన్లతోనూ రొమాన్స్ చేశాడు. కానీ మాగ్జిమం సినిమాలన్నీ పోయాయి. ఎందుకంటే మాస్ హీరో కావాలన్న ఆరాటంలో కంటెంట్ చూడ్డంలో తడబడ్డాడు. కొన్ని కథలు బానే ఉన్నా.. వాటిలో అతని ఇమేజ్ ఫిట్ కాలేదు. దీంతో రీసెంట్ గా వచ్చిన సాక్ష్యం కూడా శ్రీనివాస్ కు నిరాశనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో కుర్రాడు రూట్ మార్చాడు.

ప్రస్తుతం శ్రీనివాస్ తేజ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే శ్రీనివాసరెడ్డి అనే కొత్త దర్శకుడితోనూ ఓ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లోనూ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. వీటిలో తేజ సినిమాలో కాజల్ పాత్రకే వెయిట్ ఎక్కువగా ఉంటుందని టాక్. ఈ రెండూ కాక లేటెస్ట్ గా మరో మూవీకి సైన్ చేశాడు శ్రీనివాస్. గతంలో ఒక ఊరిలో, రైడ్, వీర వంటి సినిమాలు చేసిన రమేష్ వర్మ డైరెక్షన్ లో ఓ ప్రేమకథా చిత్రమ్ చేయబోతున్నాడు శ్రీనివాస్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ ఈ మూవీని నిర్మించబోతోంది. మరి ఇప్పటికైనా ముందు తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తే బెటర్. అలా కాకుండా ఒకేసారి మాస్ హీరో అంటే అదంత ఈజీగా కాదు. ఈ విషయం అర్థమయ్యాకే కుర్రాడు కొత్త టర్న్ తీసుకున్నాడు.

More Related Stories