English   

‘ఎన్టీఆర్’లో ఎన్టీఆర్ ఉన్నట్టేనా..?

NTR-ntr-biopic
2018-10-23 16:45:58

‘‘ఎన్టీఆర్’’ టాలీవుడ్ లో మోస్ట్ క్యూరియస్ బయోపిక్.. బాలకృష్ణ టైటిల్ పాత్రలో నందమూరి తారకరామారావు బయోపిక్ గా వస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. దర్శకుడు క్రిష్ కావడం.. సినిమాలో కీలక పాత్రలకు అద్భుతమైన నటీనటుల్ని తీసుకోవడం.. వాళ్లంతా ఆయా పాత్రల్లో పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యేలా చూసుకోవడం వంటివన్నీ ఈ మూవీపై రోజురోజుకూ అంచనాలు పెంచుతూనే ఉన్నాయి.  ఇకక  లేటెస్ట్ గా బాలయ్య.. ఎన్టీఆర్ అరవింద సమేతవీరరాఘవ సినిమా సక్సెస్ మీట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. అప్పటి వరకూ వీరి మధ్య విభేదాలున్నాయి. హరికృష్ణ మరణం తర్వాత కాస్త కలిసిపోయిన వీరు ఇలా ఓపెన్ గా వేదిక ఎక్కేసరికి ఇక వివాదాలు సద్దుమణిగినట్టే అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ పాత్రపై రూమర్స్ మొదలయ్యాయి. మరి జూనియర్  ఈ మూవీలో ఉన్నట్టా లేనట్టా..?

ఆల్రెడీ కళ్యాణ్ రామ్ హరికృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో నటిస్తాడు అనే ఆరాలు కూడా మొదలయ్యాయి. మరోవైపు ఎన్టీఆర్ యంగ్ ఏజ్ పాత్రలు కూడా పూర్తి చేశాడు బాలయ్య. సో.. మాగ్జిమం తారక్ కు ఈ సినిమాలో పాత్ర ఉండదని తేలిపోయింది. కానీ తారక్ ను ఎలాగైనా ఈ మూవీలో పార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే అతనికి ఓ కొత్త పాత్ర ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అదేంటో తెలుసా.. జూనియర్ ఈ మూవీకి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. యస్.. సినిమా ఆరంభంలో కథను పరిచయం చేస్తూనో.. కథలోకి తీసుకువెళుతూనో.. లేదా కథాగమనంలోనో యంగ్ టైగర్ వాయిస్ ఉండేలా ప్రయత్నిస్తున్నారట. ఆరకంగా జూనియర్ కు ఈ మూవీలో ఒక పార్ట్ వస్తుందంటున్నారు. మరి ఈ వాయిస్ అనే మేటర్ కూడా ఎంత వరకూ నిజమనేది ఇంకా తేలలేదు.

More Related Stories