English   

ఎన్టీఆర్ కు నో చెప్పిన కీర్తి సురేష్

keerthy-Suresh
2018-10-23 18:05:28

మహానటి తర్వాత తెలుగులో కీర్తి సురేష్ కీర్తి బాగా పెరిగింది. ఆఫర్స్ తో పాటు డిమాండ్స్ కూడా బాగా పెరిగాయి. అఫ్ కోర్స్ గ్లామర్ ఉన్నప్పుడే బ్యాంక్ బ్యాలన్స్ చక్కబెట్టుకోవాలనేది ఇండస్ట్రీలో హీరోయిన్లు ఫాలో అయ్యే ఫార్ములా. అందుకే తనలా చేస్తోందనుకోవచ్చు. అయితే అమ్మడు లేటెస్ట్ గా ఎన్టీఆర్ కు నో చెప్పింది. దీంతో కీర్తి ఎట్టిపరిస్థితుల్లోనూ కాదనదు అనుకున్నవాళ్లు షాక్ అయ్యారు. మరి తనెందుకు అలా చెప్పిందో కానీ.. ఇప్పుడు కీర్తి సురేష్ ను చూసిన కళ్లతో వేరేవారిని చూడటం కాస్త కష్టమే అవుతుంది. అందుకే ఎంటైర్ టీమ్ తనకోసం బాగా ట్రై చేస్తున్నట్టు టాక్. ఇంతకీ మేటర్ ఏంటంటే.. కీర్తి సురేష్ ను ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రిగా నటించమని అడిగారు. కానీ తను నో చెప్పింది.
 
నిజానికి కీర్తి సురేష్ ను ఈ పాత్రలో నటించమని ఈ మూవీ టీమ్ చాలా రోజులుగా అడుగుతోంది. కానీ అప్పుడు కూడా తను నో అనే చెప్పింది. బట్.. ఇప్పటికే మహానటిగా ఆ పాత్రలో జీవించేసి అభినవ సావిత్రిగా అభినందనలు అందుకున్న ఈ భామను కాకుండా మరో బ్యూటీని పెడితే ఆ పాత్ర అంతే ఇంపాక్ట్ తో నటించే అవకాశం తక్కువ. ఒకవేళ చేసినా కీర్తి సురేష్ తో కంపేర్ చేస్తారు. అందుకే ‘ఎన్టీఆర్’ మూవీ టీమ్ మరోసారి కీర్తి సురేష్ ను అడిగిందట. ఇప్పటికీ తను నో అనే చెబుతోంది. దీంతో ఏం చేయాలా అని హెడ్ పట్టుకున్నారట. ఏదేమైనా బాలయ్య వంటి హీరో, క్రిష్ లాంటి దర్శకుడితో చేసే ఛాన్స్ అంటే మిస్  చేసుకోకపోవడమే ఉత్తమం. పైగా తను ఆల్రెడీ ఓ ముద్ర వేసింది కాబట్టి.. మరొకరిలో ఆ ఫేస్ ను చూడలేరు. మరి ఈ మూవీకి దొరికే కొత్త సావిత్రి ఎవరో చూడాలి. 

More Related Stories