English   

అర్జున్ రెడ్డి కమెడియన్ ఆ మేటర్ ఎవరికీ చెప్పొద్దంటున్నాడు

Rahul-Ramakrishna
2018-10-23 18:48:36

అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ అయిపోయాడు రాహుల్ రామకృష్ణ. మంచి ఎడ్యుకేటెడ్ అయిన రాహుల్ కు ఆ తర్వాత ఆఫర్స్ వెల్లువెత్తాయి. ఏకంగా మహేష్ బాబు నటించిన భరత్ అనేనేను లోనూ ఓ కీలక పాత్ర వచ్చింది. ప్రస్తుతం కమెడియన్ గా చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు రాహుల్ రవీంద్రన్. పూర్తిగా తెలంగాణ స్లాంగ్ తో మాట్లాడుతూ.. అద్బుతమైన టైమింగ్ తో వెరీ నేచురల్ గా యాక్ట్ చేస్తాడు అనే పేరున్న రాహుల్ లేటెస్ట్ గా ఓ శుభవార్త చెప్పాడు. కానీ ఈ మేటర్ ఎవరికీ చెప్పొద్దట. అదేంటీ అంటే.. అదంతే.. వాళ్లు కమెడియన్స్ కదా అని మనం సరిపెట్టుకోవాలి. కానీ శుభవార్తేంటో తెలుసా.. మనోడు పెళ్లి చేసుకోబుతున్నాడట. ప్రస్తుతం మిఠాయి, హుషారు సినిమాల్లో కీలక పాత్రలు కూడా చేస్తోన్న రాహుల్ రామకృష్ణ తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తనకు కాబోయే శ్రీమతితో ఓ బీచ్ లో దిగిన ఫోటోను కలిపి ట్వీట్ చేశాడు రాహుల్. ‘‘జనవరి 15న నా పెళ్లి. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అతనికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

More Related Stories