English   

ఈ సారి ఏ నేరాలు చూపిస్తావ్ ‘సర్కార్’

Vijay-Sarkar
2018-10-23 19:02:16

కోలీవుడ్ టాప్ హీరోగా ఓ వెలుగు వెలుగుతోన్న స్టార్ విజయ్. ఫ్యాన్స్ ఇళయదళపతిగా చెప్పుకునే విజయ్ కు అక్కడ తిరుగులేని క్రేజ్ ఉంది. కానీ ఆ స్థాయిలో టెన్ పర్సెంట్ కూడా మన దగ్గర మార్కెట్ క్రియేట్ చేసుకోలేకపోయాడు విజయ్. విజయ్ సినిమాల్లో తమిళ సినిమాల్లో సాధారణంగా కనిపించే అతి కాస్త అతిగానే కనిపిస్తుంది. అందుకే మొదట్లో విజయ్ సినిమాలు మనవాళ్లకు పెద్దగా నచ్చలేదు. ఈ లోగా అతని తరంలో వచ్చిన చాలామంది ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. కానీ విజయ్ కి మాత్రం సాధ్యం కావడం లేదు.

 ఇక కొన్నాళ్ల క్రితం మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన తుపాకితో మాగ్జిమం మెప్పించాడు. బట్ మళ్లీ మామూలే.. తర్వాత ఆ స్థాయి సినిమాలు రాలేదు. అయితే ఈ మధ్య కాలంలో విజయ్ సినిమాలు కూడా కమర్షియల్ యాంగిల్ తో పాటు సోషల్ ఎలిమెంట్స్ నూ మిక్స్ చేసుకుని వస్తున్నాయి. ఆ కోవలో చేసిన కత్తి సినిమానే మన మెగాస్టార్ రీ ఎంట్రీకి ‘ఖైదీ నెంబర్ 150’గా తీసుకున్నాడు. ఆ మధ్య తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన మెర్సల్ ను తెలుగులో అదిరిందిగా డబ్ చేశారు. సినిమా బానే ఉన్నా ఎందుకో ఇదీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు మరో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాతో వస్తున్నాడు విజయ్. అదే సర్కార్.

ఈ సారి కూడా మురుగదాసే దర్శకుడు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో కత్తి, తుపాకి వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఈ రెండు సినిమాల్లోనూ కంటెంట్ చాలా బలంగా ఉంటుంది. సర్కార్ ట్రైలర్ చూస్తోంటే ఈ సారి కూడా బలమైన కథతోనే వస్తున్నట్టు తెలుస్తోంది. తుపాకిలో రక్షణ మంత్రుల అవినీతి, స్లీపర్ సెల్స్ ను అద్భుతంగా చూపించిన మురుగదాస్.. కత్తిలో కార్పోరేట్ మోసాలను ఎండగట్టాడు.. ఇక ఈ సారి వైట్ కాలర్ నేరాలపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. కీర్తి సురేష్, విజయ్ సరసన హీరోయిన్ గా రెండో సారి నటిస్తోంది. ఇక ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ మూవీని దీపావళి సందర్భంగా తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదల చేయబోతున్నారు. 

More Related Stories