English   

రాజు గారి కొడుక్కి ‘వర్కవుట్’ అయింది

Senior Telugu PRO BA Raju Son Shiva Kumar’s Workout Ayindhi Firstlook
2018-10-23 20:30:30

సినిమా పరిశ్రమ అంటే వారసుల రాజ్యం. ఇప్పుడంతా వాళ్లదే హవా. ప్రతి విభాగం నుంచీ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. దర్శకుల కొడుకులు దర్శకులు కావడం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్ లోకి ఇప్పుడు మరో వారసుడు వచ్చాడు. తెలుగు పరిశ్రమకు సీనియర్ మోస్ట్ ‘పి.ఆర్.వో’ బి.ఏ రాజు. మద్రాస్ నుంచీ పిఆర్వో గా ఉంటూ వస్తోన్న బిఏ రాజు ప్రస్తుతం టాలీవుడ్ లో అందరికీ కావాల్సిన వ్యక్తి.

Senior Telugu PRO BA Raju Son Shiva Kumar’s Workout Ayindhi

బి.ఏ. రాజు, జయల తనయుడు శివకుమార్. బి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. అందుకు సంబంధించిన ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘వర్క్ అవుట్’ అయింది అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించి దర్శకుడి పరిచయం మాత్రమే ఇచ్చారు. ఇంకా నటీనటులు, మిగతా టెక్నిషీయన్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏం లేవు. త్వరలోనే ఆ డీటెయిల్స్ చెబుతాం అని చెప్పారు. మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే శివకుమార్ క్రియేటివిటీ కనిపిస్తోంది. చార్మినార్ ఎదురుగా కాస్ట్ లీ కార్ పార్క్ చేసి ఉంది. ఆ పక్కన కేఫ్ కనిపిస్తోంది. అలాగే టైటిల్ లో ఓ వైపు తుపాకి, మరోవైపు కరెన్సీ ఉంది.. సో.. చూస్తోంటే ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ లా ఉంది. మొత్తంగా బిఏ రాజు కుటుంబం నుంచి మరో దర్శకుడు వస్తున్నాడన్న మాట.

More Related Stories