English   

సన్నీలియోన్ డౌన్ డౌన్

Sunny Leone’s Veeramadevi to face Protest in Bangalore
2018-10-23 22:09:02

సన్నీలియోన్... ఈ పేరు చెపితే వెంటనే గుర్తొచ్చేది పోర్న్ వీడియోలు. సన్నీలియోన్ సిక్ కుటుంబానికి చెందిన వ్యక్తి. 2013 నుంచి పోర్న్ వీడియోస్ చేయడం మానేసింది. ఇండియాకు వచ్చి కొన్ని సినిమాలు చేసింది... ఆ టైంలో సన్నీ కి యాక్టింగ్ ఈమెకు సెట్ అవ్వదు పోర్న్ సినిమాలు చేసుకొంటే బాగుంటది అని క్రిటిక్స్  చాలా మంది అవహేళన చేసారు. తర్వాత యాక్టింగ్ అండ్ డ్యాన్సింగ్ మీద దృష్టి పెట్టి కాస్త పర్లేదు అనిపించుకొంది. ఈ మధ్యే సన్నీలియోన్ 'వీరమహాదేవి' సినిమా ఒప్పుకొంది. ‘వీరమహాదేవి’ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ సౌత్ లోని అన్ని భాషల్లో విడుదల చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరమహాదేవిని కన్నడిగులు వీరవనితగా చూస్తారు. అలాంటి ధీర వనిత పాత్రను శృంగాతార తార ఇమేజ్ ఉన్న సన్నిలియోన్ చేయడం వారికి అస్సలు నచ్చడం లేదు.

Sunny Leone’s Veeramadevi to face Protest in Bangalore

దీంతో ‘కర్ణాటక రక్షణ వేదిక’ను ఏర్పాటు చేసి కొందరు ఈ సినిమాలో సన్నిలియోన్ టైటిల్ పాత్ర చేయడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతే కాదు.. ఈ మంగళవారం బెంగళూరులోని టౌన్ హాల్ లో సన్నిలియోన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆమె పోస్టర్స్ ను తగులబెట్టారు. మొత్తంగా మొన్నటి వరకూ సాధారణ నిరసనగానే ఉన్న ఈ వ్యతిరేకత ఇప్పుడు ఏకంగా సన్నిలియోన్ పోస్టర్స్ తగలబెట్టే వరకూ వచ్చిందంటే దీనికి రాజకీయ రంగు కూడా అంటుకున్నట్టు కనిపిస్తోంది. మరి ఈ గొడవ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

More Related Stories