English   

అబ్బో.. మరో ‘కోడి’ కూడా ఉందటండోయ్

Actor Vishal’s Pandem Kodi 2 Hit he his Announced Pandem Kodi 3
2018-10-24 08:34:52

విశాల్ ను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా పందెంకోడి. ఒకే దెబ్బకు రెండు మార్కెట్లు అన్నట్టుగా ఈ సినిమాతో తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకేసారి మార్కెట్ సంపాదించుకున్నాడు విశాల్. అందుకే మనోడికి ఈ సినిమా అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే తన 25వ సినిమాగా దీనికి సీక్వెల్ చేశాడు. ఈ దసరాకు విడుదలైన పందెంకోడి -2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఐదు రోజుల్లోనే 5కోట్ల 63 లక్షల షేర్ వసూలు చేసి విశాల్ కు తెలుగులో ఫస్ట్ వీక్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నిజానికి ఈ సినిమాను కొన్నది కూడా 6 కోట్లకే. ఇప్పటికే దానికి షేర్ రూపంలోనే దానికి దగ్గరగా వచ్చింది కాబట్టి తెలుగులో అనువాద హక్కులు కొన్న ఠాగూర్ మధుకు ఈ మూవీ మంచి లాభాల్నే తెస్తుందనుకోవచ్చు. ఇక ఈ ఆనందాన్ని పంచుకుంటోన్న క్రమంలో వీళ్లు చెప్పిన మాట.. పందెంకోడికి మరో సీక్వెల్ ఉంటుందట.

యస్.. పందెంకోడి -3కి ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ మొదలైందని చెప్పాడు దర్శకుడు లింగుస్వామి. ఈ రెండు  భాగాలను ఆయనే డైరెక్ట్ చేశాడు. సో థర్డ్ పార్ట్ కూడా లింగుస్వామి చేతుల్లోనే రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఇక హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ పై ఈ సందర్భంగా విశాల్ ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. తను మహానటికి పూర్తిగా భిన్నమైన పాత్రలోనూ బాగా ఒదిగిపోయిందని పొగిడాడు. మొత్తంగా ఈ రెండు కోళ్లతో ఆగిపోలేదు.. మరో కోడి కూడా రంగంలో ఉంది అని దర్శకుడు చెప్పాడు. మరి ఆ కోడి ఎప్పుడు వస్తుందో.

More Related Stories