English   

బాబోయ్.. లక్ష్మీ పార్వతిగా శ్రీ రెడ్డి నా...?

Sri-Reddy
2018-10-24 10:50:32

సినిమా వారిలోరాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కొన్నిసార్లు ఇవి నిజమైన పొలిటికల్ బ్యాటిల్ కంటే భీకరంగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటి బ్యాటిలే జరుగుతోంది టాలీవుడ్ లో. అందుకు వేదికగా మారాడు మహా నటుడు ఎన్టీరామారావు. ఆయనపై తీస్తోన్న బయోపిక్ కు పోటీగా రామ్ గోపాల్ వర్మ మరో మూవీ తీస్తున్నాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో తెరకెక్కించబోతోన్న ఈ మూవీ మొదటి నుంచీ కాంట్రవర్శీయల్ గానే ఉంది. ఇక లేటెస్ట్ గా ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇచ్చాడు వర్మ. ఈ సినిమాను జనవరి 24న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు. అంత వరకూ బానే ఉంది కానీ.. అదే రోజు ఎన్టీఆర్ బయోపిక్ నుంచి వస్తోన్న రెండో పార్ట్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ కూడా విడుదలవుతోంది. అయితే వర్మ సినిమాను ఓ వైసిపీ నాయకుడు నిర్మిస్తుండటంతో.. దీనికి పొలిటికల్ కలర్ యాడ్ అయింది. అందుకే వర్మకు పోటీగా మరో టిడిపి నాయకుడు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి కూడా లక్ష్మీ పార్వతిపై ఓ సినిమా తీస్తానని ప్రకటించాడు. అప్పట్లో వర్మ కాస్త సైలెంట్ కాగానే ఇతనూ సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు వర్మ మళ్లీ తెరపైకి వచ్చాడు కాబట్టి.. జగదీష్ రెడ్డి కూడా లైన్ లోకి వచ్చాడు.. తను తీయాలనుకున్న ‘లక్ష్మీస్ వీరగంధం’ ఖచ్చితంగా ఉంటుందని ప్రకటించాడు.అంతే కాదు.. ఈ మూవీలో లక్ష్మీ పార్వతి పాత్రలో వివాదాస్పద నటి శ్రీ రెడ్డిని తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే అటు శ్రీ రెడ్డి నుంచి ఇందుకు సంబంధించిన వివరాలేం లేవు. బట్ నిజంగానే శ్రీ రెడ్డిని తీసుకుంటే మేటర్ మరింత వేడెక్కడం ఖాయం.

More Related Stories